Realme P4 Pro Price: భారీ ఫీచర్స్ తో వస్తున్న ఈ ఫోన్ ధర తెలుసుకోండి.!

HIGHLIGHTS

రియల్ మీ పి4 ప్రో అంచనా ప్రైస్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది

టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు చాలా అందించింది

ఈ ఫోన్ అంచనా ధర కూడా ఇదే పేజీ నుంచి రివీల్ చేసింది

Realme P4 Pro Price: భారీ ఫీచర్స్ తో వస్తున్న ఈ ఫోన్ ధర తెలుసుకోండి.!

Realme P4 Pro Price: రియల్ మీ అప్ కమింగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి4 ప్రో అంచనా ప్రైస్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు చాలా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ అంచనా ధర కూడా ఇదే పేజీ నుంచి రివీల్ చేసింది. ఈ ఫోన్ కలిగిన ఫీచర్స్ తో ఈ ఫోన్ ధర ను పోల్చి అంచనా ప్రైస్ లెక్కించే ప్రయత్నం చేశాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4 Pro Price ఏమిటి?

రియల్ మీ ఈ ఫోన్ ను అండర్ రూ. 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ ధర 29,999 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ మరియు ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న హెవీ కాంపిటీషన్ ను పరిగణలోకి తీసుకుని, ఈ ఫోన్ రూ. 24,999 నుంచి రూ. 29,999 ధరలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది బేసిక్ వేరియంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో కూడిన ధర కావచ్చని కూడా చెబుతున్నారు. మరి ఈ ఫోన్ అంచనా ధర ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Realme P4 Pro Price తో ఈ ఫోన్ ఫీచర్స్ ఎంత వరకు సమంజసం?

రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నట్లు చెబుతున్న ఈ ఫోన్ ఫీచర్ తో పోల్చి చూస్తే రియల్ మీ ఈ ఫోన్ ను కాంపిటీటివ్ ధరలో అందిస్తున్నట్లు చూడొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే, ఈ ఫోన్ అండర్ 30K ధరలో ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ఫోన్ లకు భారీ కాంపిటీషన్ అవుతుందని అంచనా వేసి చెబుతున్నారు.

అలా చెప్పడానికి కారణం ఏమిటి?

ఇలా చెప్పడానికి ముఖ్యమైన కారణం కంపెనీ ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ఫీచర్స్ లేదా ఈ ఫోన్ స్పెక్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ కలిగిన టాప్ 5 ఫీచర్స్ ఇందుకు ముఖ్య కారణం అవుతాయి.

Also Read: Lava Play Ultra 5G: గేమింగ్ కోసం కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న లావా.!

రియల్ మీ పి4 ప్రో టాప్ 5 ఫీచర్స్ ఏమిటి?

  • క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ + హైపర్ విజన్ AI చిప్
  • 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన కర్వుడ్ డిస్ప్లే
  • 50MP ట్రిపుల్ రియర్ + 50MP సెల్ఫీ కెమెరాలు
  • 7000 mAh బిగ్ బ్యాటరీ + 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్
  • IP65 అండ్ IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్
Realme P4 Pro Price and top 5 features

ఈ ఫోన్ డిజైన్ ఎలా ఉంటుంది?

ఈ రియల్ మ్మి స్మార్ట్ ఫోన్ చాలా ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.68mm మందంతో చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 187 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ ను టెక్ వుడ్ మెటీరియల్ అని రియల్ మీ ముద్దుగా పిలుస్తోంది. అంటే, ఈ ఫోన్ నేచురల్ ఉడ్ మాదిరిగా కనిపించే బ్యాక్ ప్యానల్ కలిగి ఉంటుంది, ఈ ఫోన్ మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఆగస్టు 20వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo