Digital Freedom: దేశ పురోగతికి కొత్త అర్థం చెబుతున్న AI స్టార్టప్స్
భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ సంవత్సరంతో 79 సంవత్సరాలు
ఇన్ని సంవత్సరాలలో దేశ పురోగతి అనేక రేట్లు పెరిగింది
ఇప్పుడు AI సహకారంతో డిజిటల్ ఫ్రీడమ్ దిశగా కూడా దేశం పరుగులు తీస్తోంది
Digital Freedom: భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ సంవత్సరంతో 79 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో దేశ పురోగతి అనేక రేట్లు పెరిగింది. ఇప్పుడు AI సహకారంతో దేశప్రగతి మరింత ముందుకు సాగుతోంది. అంతేకాదు, డిజిటల్ ఫ్రీడమ్ దిశగా కూడా దేశం పరుగులు తీస్తోంది. భారత AI స్టార్టప్స్ ఇప్పుడు డిజిటల్ ఫ్రీడమ్ కి కొత్త అర్థాలు వచ్చేలా క్రియాశీలకంగా మారాయి. సాధారణంగా డేటా యాక్సెస్ మాత్రమే డిజిటల్ ఫ్రీడమ్ గా భావించే వారికి, దీని పరిధి అంతకు మించి ఉంటుందని ఈ స్టార్టప్స్ నొక్కి మరీ చెబుతున్నాయి. ఇప్పుడు డిజిటల్ ఫ్రీడమ్ అనేది సాంకేతిక స్వతంత్రం తో స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తి తో పాటు కొత్త ఆవిష్కరణలకు స్వేచ్ఛ ఇస్తుంది. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన భారత AI స్టార్టప్స్, ఇప్పుడు దేశప్రగతిలో క్రియాశీల పాత్ర వహిస్తున్నాయి.
SurveyDigital Freedom: భారత AI స్టార్టప్స్ పాత్ర ఏమిటి?
డిజిటల్ ఫ్రీడమ్ లో భారత AI స్టార్టప్స్ పాత్ర చాలా లోతుగా ఉంది. హైదరాబాద్, పూణే, బెంగళూరు మరియు ఢిల్లీ (గురుగ్రాం) బెస్ట్ AI స్టార్టప్స్ దేశ ప్రజలకు AI ఆధారిత పరిష్కారాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా, వ్యవసాయం, వైద్యం మరియు ఫైనాన్షియల్ రంగాల్లో ఇవి కీలక పాత్రలు పోషాస్తున్నాయి.

ఉన్నతమైన వ్యవసాయం కోసం తగిన AI వాతావరణ సూచనలు స్టార్టప్స్ అందిస్తున్నాయి. అలాగే, రోగ నిర్ధారణ కోసం AI ద్వారా రోగ నిర్ధారణ అవకాశాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా, ఫైనాన్షియల్ లో ఫ్రాడ్ డిటెక్షన్ కోసం స్మార్ట్ AI మరింత చురుకుగా పని చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ భారత గ్రామీణ సమస్యలు కూడా టార్గెట్ చేస్తున్నాయి.
రైతుల కోసం AI:
ఆంధ్రప్రదేశ్ రైతులకు సరైన సమయానికి సరైన పంట వివరాలు మరియు మరింత సముచిత సమాచారం కోసం AgriMind AI మంచి సూచనలు అందిస్తోంది. గ్రామీణ హెల్త్ సెంటర్ లలో రోగులు రోగ నిర్ధారణ కోసం సహాయం చేస్తున్న Medi Check AI మరియు చిన్న మరియు సన్న వ్యాపారాల లోపాలు మరియు ఫ్రాడ్స్ కనిపెట్టడానికి Fin Shield AI మరింత సహకారం అందిస్తున్నాయి.
Also Read: ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి CMF Phone 2 Pro గొప్ప ఆఫర్లతో చవక ధరలో లభిస్తోంది.!
AI కోసం ప్రభుత్వ మద్దతు ఏమిటి?
దేశంలో AI మరింత వాడుకలోకి తేవడానికి భారత ప్రభుత్వం Digital India 2.0 మరియు Startup India వంటి ప్రోగ్రామ్స్ తో చేయూత అందిస్తోంది. వీటితో, AI రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కు మంచి మద్దతు చేకూరుస్తోంది. ఇది మాత్రమే కాదు 2024లో India AI మిషన్ ఆమోదంతో AI ప్రోత్సాహం మరియు మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం 10,300 కోట్లు కేటాయించింది.