BSNL Super Offer: నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు ఉచితంగా అందుకోండి.!
యూజర్లకు కేవలం రూ. 1 రూపాయికే నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 31వ అరకు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కేవలం ఒక సెట్ ఆఫ్ కస్టమర్లకు మాత్రమే అందిస్తుంది
BSNL Super Offer : బిఎస్ఎన్ఎల్ అందించిన ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు కేవలం రూ. 1 రూపాయికే నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 31వ అరకు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కేవలం ఒక సెట్ ఆఫ్ కస్టమర్లకు మాత్రమే అందిస్తుంది. ఈరోజు ఆ కొత్త లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ వివరాలు వివరంగా తెలుసుకోండి.
Surveyఏమిటా BSNL Super Offer?
2025 ఆగస్టు 1వ తేదీ నుంచి బిఎస్ఎన్ఎల్ లేటెస్ట్ గా ప్రారంభించిన ఫ్రీడమ్ ప్లాన్ లేదా ఆజాదీ కా ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. 2025 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కొత్త ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది. ఈ ప్లాన్ కేవలం రూ. 1 రూపాయి రీఛార్జ్ తో వస్తుంది. అయితే, ఈ ప్లాన్ అందించే అన్లిమిటెడ్ లాభాలు మాత్రం పూర్తిగా 30 రోజులు అందిస్తుంది.

అయితే, ఇక్కడ ఒక తిరకాసు ఉంది. అదేమిటంటే, ఈ ప్లాన్ కేవలం కొత్త సబ్ స్క్రైబర్స్ కోసం మాత్రమే అందించింది. అంటే, కొత్తగా బిఎస్ఎన్ఎల్ నెంబర్ ను తీసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకున్న వారు రూ. 1 చెల్లించి రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఉచిత అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. అంతేకాదు, బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డ్ ని కూడా ఉచితంగా ఆఫర్ చేస్తుంది.
Also Read: Samsung Smart Tv ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది.!
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ప్రయోజనాలు ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ 1 రూపాయలు ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 30 రోజులు చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది మరియు డైలీ 100 SMS సౌలభ్యం కూడా అందిస్తుంది. ఇప్పటికే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది మరియు ఈ నెల చివరితో ముగుస్తుంది.
మీరు కూడా బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకునే ఆలోచనలో ఉంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే, కొత్త సిమ్ కార్డు తో పాటు 30 రోజులు ఉచిత అన్లిమిటెడ్ లాభాలు కూడా అందుకోవచ్చు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ చాలా వేగంగా 4జి సర్వీస్ లను అనేక ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, ఈ ఒక్క రూపాయి ప్లాన్ లాభాలు 4జి నెట్ వర్క్ పై కూడా అందిస్తుంది. కాబట్టి, మీరు కూడా ఈ ఉచిత 4జి లాభాలు పొందవచ్చు.