Vivo V60 5G: వి సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
వివో వి సిరీస్ నుండి వివో కొత్త ఫోన్ వి 60 5జి లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ మూడు కొత్త కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ ZEISS సూపర్ కెమెరా మరియు క్వాల్కమ్ ఫాస్ట్ చిప్ సెట్ తో వచ్చింది
Vivo V60 5G: వివో వి సిరీస్ నుండి వివో కొత్త ఫోన్ వి 60 5జి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు కొత్త కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ ZEISS సూపర్ కెమెరా మరియు క్వాల్కమ్ ఫాస్ట్ చిప్ సెట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyVivo V60 5G: ఫీచర్స్
వివో వి 60 స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, P3 వైడ్ కలర్ గామూట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. వివో వి 60 స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ / 12 జీబీ / 16 జీబీ ఫిజికల్ ర్యామ్ ఆప్షన్, 12 జీబీ వరకు అదనపు ర్యామ్ మరియు 512 జీబీ వరకు అంతర్గత మెమరీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో కంప్లీట్ గా ZEISS కెమెరా సెటప్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 50MP సూపర్ టెలిఫోటో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Ultra 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, 100x Zoom, AI కెమెరా ఫీచర్స్, మైక్రో మూవీ, ఇండియన్ వెడ్డింగ్ ఫిల్టర్లు మరియు ZEISS ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఇంత పెద్ద బ్యాటరీ కలిగి చాలా స్లీక్ డిజైన్ తో కలిగిన ఫోన్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది. ఆడియో పరంగా, ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.
Also Read: Honor X7c 5G: 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ వంటి భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
Vivo V60 5G: ప్రైస్
వివో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్ లలో అందించింది. ఈ ఫోన్ బేసిక్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ని రూ. 36,999 ధరతో, (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ని రూ. 38,999 ధరతో, (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ని రూ. 40,999 ధరతో మరియు హై ఎండ్ (16 జీబీ + 512జీబీ) వేరియంట్ ని రూ. 45,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆస్పేషియస్ గోల్డ్, మూన్ లైట్ బ్లూ మరియు మిస్ట్ గ్రే మూడు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్
ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప ఆఫర్స్ కూడా వివో అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై HDFC మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు పై 10% డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు నుంచే ప్రీ ఆర్డర్ లకు అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ ఆగస్టు 19వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులో వస్తుంది.