Realme P4 Pro 5G: లాంచ్ డేట్ మరియు టాప్ 5 ఫీచర్లు కన్ఫర్మ్ చేసిన రియల్ మీ.!
Realme P4 Pro 5G ఇండియా లాంచ్ డేట్ ఈరోజు రియల్ మీ ఈరోజు కన్ఫర్మ్ చేసింది
ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్లు కూడా ఈరోజు రియల్ మీ విడుదల చేసింది
కొత్త బ్యాక్ ప్యానల్స్ తో వస్తున్నట్లు రియల్ మీ టీజింగ్ ద్వారా చూపించింది
Realme P4 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఈరోజు రియల్ మీ ఈరోజు కన్ఫర్మ్ చేసింది. కేవలం లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్లు కూడా ఈరోజు రియల్ మీ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో వస్తుంది మరియు ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ కోడోత్ ఆకర్షించే విధంగా ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ ప్రైస్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఇంప్రెషన్ మీకు అందించడం సాధ్యం అవుతుంది.
SurveyRealme P4 Pro 5G: లాంచ్ డేట్ ఏమిటి?
రియల్ మీ పి4 ప్రో స్మార్ట్ ఫోన్ ఆగస్టు 20వ తేదీ ఇండియాలో విడుదల అవుతుందని రియల్ మీ డేట్ కన్ఫర్మ్ చేసింది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుందని క్లియర్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ టాప్ ఫీచర్లతో టీజింగ్ చేస్తోంది.
Realme P4 Pro 5G: టాప్ 5 ఫీచర్లు
డిజైన్
ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ మరియు చాలా లైట్ వెయిట్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ ఉడెన్ బ్యాక్ మరియు మరిన్ని కొత్త బ్యాక్ ప్యానల్స్ తో వస్తున్నట్లు రియల్ మీ టీజింగ్ ద్వారా చూపించింది.
ప్రోసెసర్
ఈ ఫోన్ డ్యూయల్ చిప్ సిస్టం తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ మరియు జతగా హైపర్ విజన్ AI చిప్ సెట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ కొత్త AI చిప్ సెట్ ట్రిపుల్ క్లారిటీ మరియు ట్రిపుల్ స్పీడ్ కోసం జత చేయబడిన కొత్త చిప్ అని రియల్ మీ ప్రకటించింది.
అంటే, ఈ ఫోన్ లో మరింత గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ 11,10,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ ఆఫర్ చేస్తుందని కూడా రియల్ మీ తెలిపింది.

డిస్ప్లే
ఈ ఫోన్ లో 1.07 బిలియన్స్ కలర్ సపోర్ట్ కలిగిన 4D కర్వ్ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది గొప్ప గేమింగ్ మరియు కంటెంట్ కోసం తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న కొత్త AI చిప్ సెట్ ప్రకారం, ఇది 1.5K రిజల్యూషన్ కూడా కలిగి ఉంటుంది.
బ్యాటరీ
రియల్ మీ పి4 ప్రో స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో చాలా పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ అండ్ పవర్ ఫుల్ టైటాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.
Also Read: Lava AMOLED 2 5G: స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లావా కొత్త ఫోన్ తెచ్చింది.!
కెమెరా
ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా టీజింగ్ కోసం అందించిన ఇమేజ్ లో కూడా ఈ ఫోన్ సూపర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది.
ఈ ఫోన్ ఈ ఐదు ఫీచర్లు కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ అండర్ రూ. 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.