Tecno Spark Go 5G బిగ్ బ్యాటరీ మరియు వేగవంతమైన 5G ఫీచర్ తో లాంచ్ అవుతోంది.!
Tecno Spark Go 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా విడుదల చేసింది
బిగ్ బ్యాటరీ మరియు వేగవంతమైన 5G ఫీచర్ తో లాంచ్ అవుతోందని టెక్నో తెలిపింది
Tecno Spark Go 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు వేగవంతమైన 5G ఫీచర్ తో లాంచ్ అవుతోందని టెక్నో తెలిపింది. టెక్నో బడ్జెట్ స్మార్ట్ సిరీస్ స్పార్క్ గో సిరీస్ నుంచి ఈ ఫోన్ లాంచ్ చేస్తోంది. అందుకే, ఈ ఫోన్ కూడా బడ్జెట్ ధరలో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
SurveyTecno Spark Go 5G: లాంచ్ డేట్ ఏమిటి?
టెక్నో స్పార్క్ గో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో అతి సన్నని మరియు అతి తేలికైన ఫోన్ గా ఉంటుందని టెక్నో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.
Tecno Spark Go 5G: ఫీచర్స్
టెక్నో స్పార్క్ గో 5జి స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలు టెక్నో ముందే అందించింది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో చాలా స్లీక్ గా మరియు కేవలం 194 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని టెక్నో తెలిపింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ‘నో నెట్వర్క్ కమ్యూనికేషన్’ ఫీచర్ తో వస్తుంది. ఇది నెట్వర్క్ లేని సమయంలో ఆఫ్ లైన్ కాలింగ్ కోసం సహకరిస్తుందని టెక్నో చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ 2x వరకు 5G స్పీడ్ అందించే సత్తా కలిగి ఉంటుందని కూడా టెక్నో చెబుతోంది.

ఈ ఫోన్ యొక్క బ్యాటరీ వివరాలు కూడా టెక్నో తెలిపింది. ఈ ఫోన్ పెద్ద 6000 mAh బ్యాటరీ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ టెక్నో ఫోన్ Ella AI ఫీచర్ తో ఆకట్టుకుంటుంది. ఇది సర్కిల్ టు సెర్చ్, Ai రైటింగ్ అసిస్టెంట్ మరియు మరియు మరిన్ని AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Poco M7 Plus: 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో విడుదలవుతుంది.!
ఈ టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలో మినీ కాప్స్యూల్ ఫీచర్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.