ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ లాస్ట్ డే భారీ తగ్గింపు.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ తగ్గింపు అందించింది
ఈ సూపర్ సౌండ్ బార్ అమెజాన్ GFF సేల్ చివరి రోజు గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
ఇది ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ అందించిన ప్రీమియం సౌండ్ బార్
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ తగ్గింపు అందించింది. జెబ్రోనిక్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ సూపర్ సౌండ్ బార్ అమెజాన్ GFF సేల్ చివరి రోజు గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు నెలల క్రితం ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు భారీ డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి సేల్ అవుతోంది.
SurveyZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్
జెబ్రోనిక్స్ రెండు నెలల క్రితం 1100W పవర్ ఫుల్ సౌండ్ తో కొత్త 7.2.4 సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 44,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 39,999 ధరతో అమెజాన్ సేల్ చివరి రోజు సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈరోజు సేల్ నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేస్తే రూ. 3,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, అమెజాన్ సేల్ చివరి రోజు మీరు టోటల్ రూ. 8000 రూపాయల డిస్కౌంట్ ఈ సౌండ్ బార్ పై అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 36,999 రూపాయల డిస్కౌంట్ ధరకే మీకు లభిస్తుంది. Buy From Here
Also Read: Amazon GFF Sale నుండి చవక ధరలో లభించే వెరైటీ బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఇవే.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఇది ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ అందించిన ప్రీమియం సౌండ్ బార్. ఇది 7.2.4 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఇందులో, ముందు మూడు, రెండు సైడ్ లో రెండు మరియు పైన రెండు స్పీకర్లు మరియు మూడు ట్వీటర్ లతో భారీ సెటప్ కలిగిన బార్ తో ఉంటుంది. ఇదే కాదు అప్ ఫైరింగ్ మరియు ఫ్రంట్ ఫైరింగ్ రెండు స్పీకర్లు కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ రేడియేటర్ తో 300W జబర్దస్త్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఈ సెటప్ లో ఉంటుంది.

ఈ సౌండ్ బార్ DTS X మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ టోటల్ 1100W గ్రౌండ్ షేకింగ్ మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో ఇంటిని కాదు మొత్తం గల్లి షేక్ చేసే సౌండ్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఇది ఇంటిని సినిమా హాల్ గా మార్చేస్తుంది మరియు పెద్ద సైజు హాల్ లో కూడా పూర్తిగా వైర్లెస్ కనెక్టివిటీ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI eArc, ఆప్టికల్, UHF మైక్, AUX, USB మరియు లెట్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.