OPPO K13 Turbo Series 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు విడుదల చేసిన ఒప్పో.!
OPPO K13 Turbo Series 5G లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్లు రివీల్ చేసింది
ఒప్పో స్మార్ట్ ఫోన్ బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతోంది
ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో లాంచ్ అవుతుంది
OPPO K13 Turbo Series 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్లు కూడా ఈరోజు ఒప్పో రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో లాంచ్ అవుతుంది. ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఏమిటో చూసేద్దామా.
SurveyOPPO K13 Turbo Series 5G : ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఒప్పో కె13 టర్బో సిరీస్ ఇండియాలో ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్లు సిల్వర్ నైట్, పర్పల్ ఫాంటమ్ మరియు మిడ్ నైట్ మేవరిక్ ముందు రంగులో వస్తుంది.
OPPO K13 Turbo Series 5G : కీలక ఫీచర్లు
ఒప్పో కె13 టర్బో సిరీస్ ఇండియా వేరియంట్ యొక్క దాదాపు అన్ని ఫీచర్లు కూడా ఒప్పో ఈరోజు వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ సైట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ఫీచర్లు వెల్లడించింది. ఈ ఒప్పో అప్ కమింగ్ సిరీస్ ఫోన్లు బిల్ట్ ఇన్ ఫ్యాన్ కలిగిన ఇండియా ఫస్ట్ ఫోన్స్ గా చరిత్రలో నిలిచిపోతాయి. ఈ ఫోన్ లను చాలా వేగంగా చల్లబరచి మంచి పెర్ఫార్మెన్స్ అందించడానికి వీలుగా 13 మైక్రో రెక్కలు కలిగిన మైక్రో ఫ్యాన్ ఈ ఫోన్ లో అందించింది. దానికి జతగా పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది మరియు IPX6, IPX6 మరియు IPX9 సపోర్ట్ తో గొప్ప వాటర్ అండ్ డ్రాప్ ప్రూఫ్ గా ఉంటుంది. ఈ ఫోన్ 6.79 ఇంచ్ ESport లెవెల్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ స్ప్లాష్ టచ్ మరియు గ్లోవ్ మోడ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ AI కెమెరా ఫీచర్లు మరియు గొప్ప ఫిల్టర్లు కలిగి ఉంటుంది.
Also Read: Amazon GFF Sale చివరి రోజు Sony 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది.!
ఇక ఈ ఒప్పో ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కె13 టర్బో సిరీస్ ఫోన్లు Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో వస్తుంది. ఇది TSMC 4nm ప్రోసెసర్ టెక్నాలాజి కలిగి 2.2Mn కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించగలిగే చిప్ సెట్. అంతేకాదు, ఈ సిరీస్ ఫోన్ బ్యాటరీ వివరాలు కూడా ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. ఇందులో ఫోన్ మరియు బ్యాటరీని మరింత చక్కగా నిర్వహించే ఇంటెలిజెంట్ ఛార్జింగ్ ఇంజిన్ 5.0 సపోర్ట్ ఉన్నట్లు ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు X-Axis లీనియర్ మోటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.