ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. బడ్జెట్ ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవల ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా బెస్ట్ 55 ఇంచ్ 4K Smart TV ఆఫర్?
ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ విషయానికి వస్తే, Daiwa రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ సేల్ ఈరోజు మంచి తగ్గింపు మరియు మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ టీవీ 61% భారీ డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ అందించింది, ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 26,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది.
అలాగే, ఈ స్మార్ట్ టీవీ పై ICICI మరియు BOBCARD EMI ఆఫర్ తో రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,499 రూపాయల ధరలో లభిస్తుంది.
ఈ డైవా స్మార్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10 సపోర్ట్ మరియు ALLM సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ARM క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, Av ఇన్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
ఈ డైవా స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 24W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ మరియు మంచి స్టాండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది మరియు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో హాట్ స్టార్ వంటి అన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది.