Vivo V60 లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు విడుదల చేసిన వివో.!
గత నాలుగు రోజులుగా వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo V60 లాంచ్ గురించి టీజింగ్ చేస్తున్న వివో
ఈరోజు Vivo V60 లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు విడుదల చేసింది
ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు మరియు ఫీచర్లు కూడా కంపెనీ లాంచ్ డేట్ తో పాటు వెల్లడించింది
గత నాలుగు రోజులుగా వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo V60 లాంచ్ గురించి టీజింగ్ చేస్తున్న వివో, ఈరోజు Vivo V60 లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు విడుదల చేసింది. వివో వి 60 స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ వివో అఫీషియల్ సైట్ నుండి అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు విడుదల చేసింది.
SurveyVivo V60 : ఎప్పుడు లాంచ్ అవుతుంది?
వివో వి60 స్మార్ట్ ఫోన్ ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు మరియు ఫీచర్లు కూడా కంపెనీ లాంచ్ డేట్ తో పాటు వెల్లడించింది.
Vivo V60 : కీలక ఫీచర్లు
వివో వి60 స్మార్ట్ ఫోన్ కంప్లీట్ గా కెమెరా సెంట్రిక్ ఫోన్ గా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో ట్రిపుల్ 50MP కెమెరాలు అందించింది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP ZEISS మెయిన్ కెమెరా, 50MP సూపర్ టెలిఫోటో కెమెరా జత మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP ZEISS గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఇండియన్ వెడ్డింగ్ కోసం ZEISS Style Bokeh, మల్టీ ఫంక్షనల్ పోర్ట్రైట్, సూపర్ జూమ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్లు ఈ ఫోన్ క్లైగ్ ఉన్నట్లు వివో టీజింగ్ ద్వారా తెలియజేసింది.

వివో వి60 స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా వివో చర్చింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 7 Gen 4 తో లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 5 సంవత్సరాలు సాఫీగా సాగే గొప్ప ఫీచర్లు ఉన్నట్లు కూడా వివో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS 15 తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాటరీ మరియు డిజైన్ గురించి కూడా వివో వివరాలు వెల్లడించింది.
Also Read: లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ Freedom Sale ధమాకా ఆఫర్ అందుకోండి.!
వివో వి60 స్మార్ట్ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లిమ్ బాడీ లో పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుందని కంపెనీ ఈ టీజర్ లో తెలిపింది. ఇది కాకుండా ఈ ఫోన్ Google లేటెస్ట్ Gemini మరియు AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 టాప్ గ్రేడ్ రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్లు వివో త్వరలోనే వెల్లడిస్తుంది.