Noise Air Clips 2: నోయిస్ సక్సెస్ ఫుల్ బడ్స్ లేటెస్ట్ ఎడిషన్ బడ్స్ లాంచ్ చేసింది.!

HIGHLIGHTS

నోయిస్ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది

నోయిస్ సక్సెస్ ఫుల్ బడ్స్ సిరీస్ ఎయిర్ క్లిప్స్ యొక్క నెక్స్ట్ జనరేషన్ బడ్స్ గా ఈ బడ్స్ లాంచ్ చేసింది

Noise Air Clips 2 సరికొత్త ఎయిర్ వేవ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది

Noise Air Clips 2: నోయిస్ సక్సెస్ ఫుల్ బడ్స్ లేటెస్ట్ ఎడిషన్ బడ్స్ లాంచ్ చేసింది.!

Noise Air Clips 2: నోయిస్ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నోయిస్ సక్సెస్ ఫుల్ బడ్స్ సిరీస్ ఎయిర్ క్లిప్స్ యొక్క నెక్స్ట్ జనరేషన్ బడ్స్ గా ఈ బడ్స్ లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను సరికొత్త ఎయిర్ వేవ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది. డిడ్ మాత్రమే కాదు ఈ బడ్స్ మూడు సరికొత్త రంగుల్లో కూడా లాంచ్ అయ్యింది. ఈ కొత్త బడ్స్ కంప్లీట్ ఫీచర్లు మరియు ప్రైస్ గురించి తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Noise Air Clips 2: ప్రైస్

నోయిస్ ఈ కొత్త బడ్స్ ను రూ. 3,499 రూపాయల లాంచ్ ప్రైస్ తో మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు నోయిస్ అఫీషియల్ సైట్ నుంచి ద్వారా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్స్ ఫ్రాస్ట్ బ్లాక్, ఫ్రాస్ట్ గ్రీన్ మరియు ఫ్రాస్ట్ ఐవరీ ముందుది అందమైన రంగులో లభిస్తుంది.

Noise Air Clips 2: ఫీచర్లు

నోయిస్ ఎయిర్ క్లిప్స్ 2 కొత్త ఇయర్ బడ్స్ కొత్త ఎయిర్ వేవ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఓపెన్ ఇయర్ డిజైన్ కలిగి ఉన్నా ఈ బడ్స్ నుంచి వచ్చే సౌండ్ బయటకు రాకుండా కేవలం ఆ బడ్స్ ధరించిన వారికి మాత్రమే వినిపించే విధంగా ఉంటుంది. ఈ బడ్స్ కంఫర్టబుల్ డిజైన్ మరియు చెవులు పూర్తిగా మూసేలా గొప్ప డిజైన్ తో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ కలిగి ఉంటుంది.

Noise Air Clips 2

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 12mm స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ బడ్స్ హైపర్ సింక్ మరియు IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ నోయిస్ బడ్స్ రోజంతా ధరించినా కూడా నొప్పి తెలియని విధంగా ఉండే మెత్తని క్లిప్ ఆన్ గ్రిప్ డిజైన్ తో ఉంటుంది. ఈ బడ్స్ 40 గంటల ప్లే అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది.

Also Read: Vivo T4R 5G స్మార్ట్ ఫోన్ HDR 10 ప్లస్ AMOLED స్క్రీన్ మరియు స్లిమ్ బాడీ తో లాంచ్ అవుతుంది.!

ఈ కొత్త నోయిస్ ఇయర్ బడ్స్ క్వాడ్ మైక్ ENC సపోర్ట్ మరియు లో లెటెన్సీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo