Vivo T4R 5G స్మార్ట్ ఫోన్ HDR 10 ప్లస్ AMOLED స్క్రీన్ మరియు స్లిమ్ బాడీ తో లాంచ్ అవుతుంది.!
Vivo T4R 5G స్మార్ట్ ఫోన్ జూలై 31న ఇండియాలో లాంచ్ అవుతుంది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది
వివో ఈరోజు ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి వివరాలు అందించింది
Vivo T4R 5G స్మార్ట్ ఫోన్ జూలై 31న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ మరియు వివో సంయుక్తంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఫోన్ డిజైన్, చిప్ సెట్ మరియు కెమెరా వివరాలు అందించిన వివో ఈరోజు ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి వివరాలు అందించింది.
SurveyVivo T4R 5G : ఫీచర్లు
వివో ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ డిస్ప్లే వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ మరియు SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ సపోర్ట్ కలిగి ఉంటుందని వివో వెల్లడించింది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ క్వాడ్ కర్వుడ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 7.39mm అల్ట్రా స్లిమ్ బాడీ తో క్వాడ్ కర్వుడ్ ఫోన్ కేటగిరిలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫోన్లలో కూడా అతి సన్నని ఫోనుగా ఉంటుంది.

ఇక ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 750K ప్లస్ AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7400 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేస్తుంది. ఈ చిప్ సెట్ గొప్ప మల్టీ టాస్కింగ్ మరియు మిడ్ రేంజ్ గేమింగ్ కోసం తగిన విధంగా ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ కలిగి గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా వివో అందించింది. ఈ ఫోన్ ను 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో లాంచ్ చేస్తునట్లు ప్రకటించింది. ఈ ఫోన్ బ్యాక్ కెమెరాలో 50MP ప్రధాన Sony OIS కెమెరా 2MP బొకే కెమేరా ఉంటుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ AI సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు మరిన్ని కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
Also Read: Lava Blaze Dragon: ఒక్కరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఫస్ట్ డే సేల్ అవుతుంది.!
Vivo T4R 5G : అంచనా ధర
వివో టి4ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ అంచనా ధర కూడా అందించింది. ఈ ఫోన్ ను అండర్ రూ. 20,000 రూపాయల బడ్జెట్ ధరలో అందిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ టీజింగ్ లో భాగంగా ఈ ఫోన్ అంచనా ప్రైస్ రివీల్ చేసింది.