Redmi 13C Series నుండి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న షియోమి.!
Redmi 13C Series నుండి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న షియోమి
రెడ్ మి 13సి 4G మరియు రెడ్ మి 13సి 5G లను విడుదల చేస్తోంది షియోమి
స్మార్ట్ ఫోన్ ల కీలకమైన వివరాలతో టీజింగ్ ను కూడా కంపెనీ మొదలు పెట్టింది
Redmi 13C Series నుండి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న షియోమి. ఈ సిరీస్ నుండి రెడ్ మి 13సి 4G మరియు రెడ్ మి 13సి 5G స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది షియోమి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ ల కీలకమైన వివరాలతో టీజింగ్ ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. ఇందులో, ఈ ఫోన్ల యొక్క ప్రోసెసర్, కెమేరా మరియు కలర్ వేరియంట్ లతో పాటుగా మరిన్ని ఇతర వివరాలు కూడా ఉన్నాయి.
SurveyRedmi 13C Series Specs
రెడ్ మి 13సి సిరీస్ నుండి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లను అమేజాన్ స్పెషల్ గా విడుదల చేస్తోంది మరియు అమేజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. అందుకే, అమేజాన్ ఇండియా ఈ సిరీస్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.
షియోమి టీజర్ ప్రకారం, రెడ్ మి 13సి 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6100+ తో వస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ స్టార్ ట్రైల్ బ్లాక్, స్టార్ ట్రైల్ సిల్వర్ మరియు స్టార్ ట్రైల్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ కెమేరా సెటప్ కూడా వుంది.
Also Read : Gold Rate: సెగపుట్టిస్తున్న బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!
ఇక రెడ్ మి 13సి 4G స్మార్ట్ ఫోన్ వస్తే, ఈ ఫోన్ ను స్టార్ డస్ట్ బ్లాక్ మరియు స్టార్ షైన్ గ్రీన్ కలర్ లలో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక 50MP ట్రిపుల్ కెమేరా ఉన్నట్లు ఫోన్ ఇమేజ్ ద్వారా అర్ధం అవుతోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile