vivo S2 లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వివో .. స్టైలిష్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

vivo S2 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేసిన వివో

ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది

vivo S2 లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వివో .. స్టైలిష్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!

vivo S2 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేసిన వివో ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ అనౌన్స్ చేసింది. 2020 సంవత్సరం ప్రారంభం లో వివో S1 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత ఇంతవరకు ఈ సిరీస్ నెక్స్ట్ \జనరేషన్ ఫోన్ లాంచ్ చేయలేదు. అయితే, 6 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. మరి ఇంత లాంగ్ తీసుకున్న ఈ ఫోన్ ఎలాంటి ఫీచర్స్ తో వస్తుందో చూడాలి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo S2 లాంచ్ డేట్

వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు డేట్ అండ్ టైం కూడా వివో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఐడియా ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ డిజైన్ వివరాలు అందించింది.

vivo S2 launch

vivo S2 : ఫీచర్స్

వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అలాగే, వెనుక కూడా కర్వుడ్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్ ఫోన్ పై భాగంలో అడ్డంగా ఉంటుంది. ఇది ఫ్లాగ్ షిప్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో వస్తుంది. వివో ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఒకొక్కటిగా రివీల్ చేస్తుంది.

Also Read : WhatsApp Web calling: వాట్సాప్ వెబ్ లో వాయిస్ అండ్ వీడియో కాల్ ఫీచర్ వచ్చేసింది.!

వివో ఎస్2 : అంచనా ఫీచర్స్

వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.59 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే , కొన్ని లీక్స్ ద్వారా ఈ వివో అప్ కమింగ్ ఫోన్ Snapdragon 8 Gen 5 తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేయగా, ఈ సెటప్ లో 50MP ప్రధాన సెన్సార్ జత 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే, ఇందులో 7,000mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్ సపోర్ట్ గురించి కూడా లీక్స్ చెబుతున్నాయి.

అయితే, ఈ ఫోన్ గురించి అఫీషియల్ ఫీచర్స్ ఇంకా అనౌన్స్ కాలేదు. కాబట్టి, ఈ ఫోన్ ఫీచర్స్ అఫీషియల్ గా రిలీజ్ అయ్యే వరకు మనం వేచి చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile