noise launches NoiseFit Javelin neeraj chopra special edition smartwatch
NoiseFit Javelin: ఒలంపిక్స్ లో జావలిన్ త్రో విభాగంలో తిరుగులేని గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా గుర్తు గా ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్ వాచ్ ను నోయిస్ తెచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ పేరును నోయిస్ ఫిట్ జావలిన్ గా పెట్టినా, దీన్ని నీరజ్ చోప్రా ఎడిషన్ గా పరిచయం చేసింది. ఈ స్మార్ట్ వాచ్ AMOLED డిస్ప్లే, స్పెషల్ బూట్ అప్ లోగో మరియు SOS టెక్నాలజీ వంటి చాలా ఫీచర్స్ ను కలిగి వుంది.
నోయిస్ ఈ కొత్త స్మార్ట్ వాచ్ నీరజ్ చోప్రా ఎడిషన్ ను రూ. 3,999 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ వాచ్ ను నోయిస్ gonoise.com నుంచి కొనుగోలు చేయవచ్చు.
Also Read: iQOO Z9 Lite 5G చవక ధరలో Sony AI కెమెరా, IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వచ్చింది.!
నోయిస్ జావలిన్ స్మార్ట్ వాచ్ 1.46 ఇంచ్ రౌండ్ డయల్ AMOELD స్క్రీన్ తో వచ్చింది. ఇది 466×466 రిజల్యూషన్ మరియు క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 7 రోజుల యూసేజ్ టైం అందించే గొప్ప బ్యాటరీతో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ వాచ్ మెటల్ కేస్ తో వస్తుంది మరియు IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఈ స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ మోనిటర్, స్లీప్ మోనిటర్, స్ట్రెస్ మెజర్మెంట్, స్టెప్ ట్రాకర్ SpO2 మోనిటర్ మరియు ఫీమేల్ సైకిల్ ట్రాకర్ లను కలిగి వుంది. అంతేకాదు, SoS టెక్నాలజీ, DND మోడ్, ఫంక్షనల్ క్రౌన్, స్టాప్ వాచ్ మరియు రిమైండర్ వంటి స్మార్ట్ ఫీచర్ లను కూడా కలిగి వుంది.
ఇండియా బ్లూ సింగిల్ కలర్ వేరియంట్ లో మాత్రమే ఈ స్మార్ట్ వాచ్ ను అందించింది. ఈ నీరజ్ చోప్రా ఎడిషన్ స్మార్ట్ వాచ్ అనేక స్పోర్ట్స్ మోడ్ సపోర్ట్ మరియు క్లౌడ్ బేస్ వాచ్ ఫేస్ సపోర్ట్ లను కలిగి వుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ వాచ్ లో మన గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా సిగ్నేచర్ ను కూడా అందించింది.