Noise ColorFit Ore లాంగ్ బ్యాటరీ మరియు పెద్ద AMOLED స్క్రీన్ తో వచ్చింది.!

HIGHLIGHTS

నోయిస్ నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చింది

Noise ColorFit Ore పేరుతో ఈ వాచ్ ను లాంఛ్ చేసింది

ఈ స్మార్ట్ వాచ్ ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది

Noise ColorFit Ore: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నోయిస్ నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చింది. నాయిస్ కలర్ ఫిట్ ఓర్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ను పెద్ద AMOLED స్క్రీన్ మరియు లాంగ్ బ్యాటరీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను కూడా ఫ్యూచర్లకు తగిన విధంగా అందించినట్లు కూడా కంపెనీ నొక్కి చెప్పింది.

Noise ColorFit Ore: Price

నాయిస్ కలర్ ఫిట్ ఓర్ స్మార్ట్ వాచ్ ను రూ. 2,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది.

Also Read: Samsung Galaxy M55 5G ఈ Top – 5 ఫీచర్స్ తో ఇండియాలో లాంఛ్ అవుతోంది.!

Noise ColorFit Ore: ప్రత్యేకతలు

నాయిస్ కలర్ ఫిట్ ఓర్ స్మార్ట్ వాచ్ ను అంచి ఫీచర్స్ తో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ 2.1 ఇంచ్ AMOLED స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్క్రీన్ 368 x 448 రిజల్యూషన్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంటే, ఈ స్క్రీన్ ఎండలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లెథర్, సిలికాన్ మరియు మెటల్ స్ట్రాప్స్ ఆప్షన్ లలో వస్తుంది.

Noise ColorFit Ore Features

ఈ స్మార్ట్ వాచ్ లో ఫంక్షనల్ క్రౌన్ మరియు మెటల్ బిల్ట్ తో మంచి లగ్జరి లుక్ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ BT v5.2 మరియు True Sync తో క్రిస్టల్ క్లియర్ కాలింగ్ ను అందిస్తుంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 150+ వాచ్ ఫేస్ లను కలిగి ఉంటుంది.

ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ నోయిస్ హెల్త్ సూట్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, హార్ట్ రేట్, స్లీప్ మోనిటర్, ఫిమేల్ సైకిల్ ట్రాకర్ మరియు SpO2 ట్రాకర్ వంటి చాలా ఫీచర్స్ ను ఎనేబుల్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :