Garmin Quatix 8 Pro: శాటిలైట్ SOS వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 15-Jan-2026
HIGHLIGHTS

Garmin Quatix 8 Pro మెరైన్ (నావిగేషన్) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం స్మార్ట్‌ వాచ్

ఇది సముద్రం లోపల ఉన్నా లేదా ఒడ్డు మీద ఉన్నా కూడా చక్కగా పని చేస్తుంది

LTE మరియు శాటిలైట్ SOS వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

Garmin Quatix 8 Pro: ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ గార్మిన్ అత్యద్భుతమైన మెరైన్ ఫీచర్స్ తో ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను అందించింది. ఇది మెరైన్ (నావిగేషన్) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం స్మార్ట్‌ వాచ్. ఇది సముద్రం లేదా ఒడ్డు మీద ఉన్నా కూడా కమ్యూనికేషన్, ట్రాకింగ్ మరియు హెల్త్ ట్రాకింగ్ వంటి అన్ని పనులు ఒకే వాచ్‌లో అందిస్తుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్స్ చూద్దామా.

Garmin Quatix 8 Pro: ఫీచర్స్

ఈ స్మార్ట్ వాచ్ 1.4 ఇంచ్ AMOLED టచ్‌ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ స్క్రీన్ (454 × 454) పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన కలర్ స్క్రీన్ మరియు లార్జ్ ఫాంట్ మోడ్ కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ టైటానియం బెజెల్ జతగా ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ బ్యాక్ మెటీరియల్ తో కేస్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 10 ATM తో మెరుగైన వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది.

ఇక ఈ వాచ్ కలిగిన లీక్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ నావిగేషన్ / కంట్రోల్ ఫీచర్లను ముందుగా చూపే బోట్ మోడ్ ఉంటుంది. ఇందులో, ఆటోపైలట్ కంట్రోల్, ట్రోలింగ్ మోటార్ డేటా మరియు ఇతర వెస్సల్ డేటా అందిస్తుంది. ఇదే కాదు సమర్ధవంతమైన చార్ట్ ప్లోటర్ ఫంక్షన్లకు యాక్సెస్ కూడా ఇస్తుంది. ఇక GPS కనెక్షన్ విషయానికి వస్తే, ఇందులో GPS, GLONASS, Galileo, QZSS మరియు BeiDou వంటి మల్టీ బ్యాండ్ GPS నావిగేషన్ మరియు SatIQ వంటి ప్రీమియం నావిగేషన్ సెటప్ ఉన్నాయి.

ముఖ్యంగా, ఈ వాచ్ లో అందించిన డెప్త్ సెన్సార్‌ ఏకంగా సముద్రంలో 40 మీటర్లు లోతు వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, ఈ వాచ్ సముద్ర ప్రయాణం కోసం ప్రత్యేకంగా ట్యూన్డ్ చేయబడినైనా చేయబడిన ప్రత్యేకమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఇది LTE మరియు శాటిలైట్ SOS వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంది.

ఇక ఈ వాచ్ కలిగిన హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్ చూస్తే, ఇందులో 24×7 హార్ట్‌ రేట్ మానిటరింగ్, ECG సపోర్ట్, పల్స్ ఆక్సిజన్ ట్రాకింగ్, శ్వాస ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, నాప్ డిటెక్షన్, స్ట్రెస్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ మరియు హైడ్రేషన్ అండ్ స్కిన్ టెంపరేచర్ వంటి ప్రీమియం ట్రాకింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇదే కాదు ఈ వాచ్ లో మహిళల కోసం ప్రత్యేకమైన ట్రాకింగ్ సపోర్ట్ మరియు జెట్ లాగ్ గైడెన్స్ కూడా ఉన్నాయి.

Also Read: iQOO 15 ను అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుంచి అతి తక్కువ ధరలో అందుకోండి.!

Garmin Quatix 8 Pro: ప్రైస్

ఈ స్మార్ట్ వాచ్ ప్రపంచ మార్కెట్లో $1,299.99 (సుమారు రూ. 1,17,476) రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఇది బోట్ అండ్ బోయింగ్ ప్రయాణానికి చాలా అనుకూలమైన స్మార్ట్ వాచ్ గా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :