5 వేలకే Smartphone మాదిరిగా పనిచేసే Smart Watch లాంచ్.!

HIGHLIGHTS

Smartphone మాదిరిగా పని చేసే కొత్త Smart Watch ని Fire-Boltt లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ వాచ్ ఇటీవలే విడుదలయ్యింది

ఈరోజుతో ఈ స్మార్ట్ వాచ్ పైన అందించిన లాంచ్ ఆఫర్ ముగుస్తుంది

5 వేలకే Smartphone మాదిరిగా పనిచేసే Smart Watch లాంచ్.!

Smartphone మాదిరిగా పని చేసే కొత్త Smart Watch ని Fire-Boltt లాంచ్ చేసింది. అదే, ఫైర్ బోల్ట్ సరికొత్తగా ఇండియాలో విడుదల చేసిన Dream స్మార్ట్ వాచ్ . ఈ స్మార్ట్ వాచ్ ని 4G LTE Nano SIM కార్డ్ ను నేరుగా ఇన్సెర్ట్ చేసుకొని కాలింగ్, చాటింగ్, యూట్యూబ్ వీడియోలను సైతం నేరుగా చూడగలిగే విధంగా తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ స్మార్ట్ వాచ్ ఒక స్మార్ట్ ఫోన్ చెయ్యగల అన్ని పనులను చేయగల సత్తాని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఇటీవలే విడుదలయ్యింది మరియు ఈరోజుతో ఈ స్మార్ట్ వాచ్ పైన అందించిన లాంచ్ ఆఫర్ ముగుస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Smartphone like Smart Watch

ఫైర్ బోల్ట్ డ్రీమ్ స్మార్ట్ వాచ్ ను ఇండియాలో కేవలం రూ. 5,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ వాచ్ స్ట్రిప్ వేరియంట్ ను బట్టి ఈ వాచ్ ధర రూ. 6,499 వరకు ఉంటుంది. అయితే, ఇది లాంచ్ ఆఫర్ లో భాగంగా నిర్ణయించిన ధరలు మరియు ఈరోజుతో ఈ లాంచ్ ఆఫర్ ముగుస్తుంది. రేపటి నుండి ఇదే స్మార్ట్ వాచ్ రూ. 6,999 రూపాయల ప్రారంభ ధరతో సేల్ అవుతుంది.

ఈ స్మార్ట్ వాచ్ పైన తెలిపిన లాంచ్ ధరతో కేవలం ఫైర్ బోల్ట్ వెబ్సైట్ నుండి మాత్రమే లభిస్తోందని గుర్తుంచుకోండి. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా ఆఫర్ చేస్తోంది ఫఫైర్ బోల్ట్.

Also Read : Amazon Great Republic Day Sale 2024 జనవరి 13 నుండి మొదలువుతుంది.!

Fire-Boltt Dream ప్రత్యేకతలు

ఫైర్ బోల్ట్ డ్రీమ్ స్మార్ట్ వాచ్ 2.02 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది. ఈ వాచ్ ను Cortex -A7MP క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా ఈ వాచ్ లో 2GB RAM మరియు 16GB స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ వాచ్ లో 4G LTE Nano SIM ను ఉపయోగించవచ్చు. Android OS పైన పని చేసే ఈ స్మార్ట్ వాచ్ లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది మరియు స్టోర్ నుండి మీకు నచ్చిన యాప్స్ ను డౌన్ లోడ్ చేసి వాడుకోవచ్చు.

fire boltt dream smart watch work like smartphone fire boltt dream

ఈ స్మార్ట్ వాచ్ లో వాట్సాప్, యూట్యూబ్ మరియు మరిన్ని యాప్స్ ను ఉపయోగించుకునే వీలుంది. ఈ స్మార్ట్ వాచ్ నుం ఎటువంటి స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు మరియు నేరుగా కాలింగ్ మరియు చాటింగ్ ను కూడా చేసుకునే వీలుంది. ఇది స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ వాచ్ ల కలయిక అని కంపెనీ చెబుతోంది. అంటే, ఈ స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ వాచ్ చేసే అన్ని పనులను చేయగలదని చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo