Amazon Great Republic Day Sale 2024 జనవరి 13 నుండి మొదలువుతుంది.!
Amazon Great Republic Day Sale 2024 జనవరి 13 నుండి మొదలువుతుంది
SBI బ్యాంక్ భాగస్వామ్యంతో వస్తున్న అమేజాన్ బిగ్ సేల్
అమేజాన్ అందించబోతున్న డీల్స్ మరియు ఆఫర్లు
Amazon Great Republic Day Sale 2024 జనవరి 13 నుండి మొదలువుతుంది డేట్ అనౌన్స్ చేసింది అమేజాన్. SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వస్తున్న ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ లను అందించనున్నట్లు చెబుతోంది అమేజాన్. 2024 రిపబ్లిక్ డే మరియు సంక్రాంత్రి పండుగ సందర్భంగా అమేజాన్ తీసుకు వచ్చిన ఈ బిగ్ సేల్ నుండి అమేజాన్ అందించబోతున్న డీల్స్ మరియు ఆఫర్లు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyAmazon Great Republic Day Sale 2024
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 సేల్ ను జనవరి 13మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభించనున్నట్లు అమేజాన్ అనౌన్స్ చేసింది. అయితే, అమేజాన్ ప్రైమ్ మెంబెర్స్ మాత్రం 12 గంటలు ముందుగా, అంటే జనవరి 13వ తేదీ అర్ధరాత్రి 13 గంటల నుండే సేల్ యాక్సెస్ అందుకుంటారు.

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి స్మార్ట్ ఫోన్ ల పైన 40% వరకూ డిస్కౌంట్ ను అందుకోవచ్చని అమేజాన్ తెలిపింది. ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ లను No Cost EMI, Exchange Offer మరియు Coupon ఆఫర్ లతో సేల్ చేయబోతున్నట్లు టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఆఫర్లతో స్మార్ట్ ఫోన్ లను చవక ధరకే అందుకోవచ్చని అర్ధం.
Also Read : Realme 12 Pro Launch: భారీ Periscope కెమేరాతో లాంచ్ చేస్తున్న రియల్ మి.!
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి అందించనున్న స్మార్ట్ ఫోన్ ఆఫర్లలో Apple iPhone 13 ముఖ్యమైనదిగా చెబుతోంది. అమేజాన్ అప కమింగ్ సేల్ నుండి ఐఫోన్ 13 ఫోన్ ను కేవలం రూ. 49,999 రూపాయల అఫర్ ధరకే అందుకోవచ్చని అమేజాన్ చెబుతోంది.
ఇవి మాత్రమే కాదు, స్మార్ట్ టీవీలు మరియు అప్లయన్సెస్ పైన 65% డిస్కౌంట్, హోమ్, కిచెన్ మరియు అవుట్ డోర్ ప్రోడక్ట్స్ పైన 70% వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చని కూడా అమేజాన్ చెబుతోంది. ఇదే కాదు, ల్యాప్ టాప్స్, ట్యాబ్ లెట్స్, స్మార్ట్ వాచ్, ఇయర్ వుడ్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన 75% వరకూ డిస్కౌంట్ అందుకునే వీలుందని కూడా అమేజాన్ టీజింగ్ చేస్తోంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile