Realme 12 Pro Launch: భారీ Periscope కెమేరాతో లాంచ్ చేస్తున్న రియల్ మి.!

HIGHLIGHTS

రియల్ మీ కొత్త ఫోన్ లాంఛ్ కోసం ఏర్పాట్లు చేస్తోంది

Realme 12 Pro ను భారీ Periscope కెమేరాతో లాంచ్ చేస్తోంది

ఈ ఫోన్ లాంచ్ గురించి కొత్త వివరాలను అందించింది

Realme 12 Pro Launch: భారీ Periscope కెమేరాతో లాంచ్ చేస్తున్న రియల్ మి.!

Realme 12 Pro Launch: రియల్ మీ కొత్త ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ చెయడం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ Periscope కెమేరాతో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ గత వారం టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. అయితే,ఈ ఫోన్ లాంచ్ డేట్ గురించి మాత్రం ఎటువంటి వివరాలను అందించ లేదు. కానీ, ఈ ఫోన్ లాంచ్ గురించి కొత్త వివరాలను అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 12 Pro Launch

రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మి 12 ప్రో ను 200MP కంటే మరింత అధికమైన రిజల్యూషన్ అందించ గల పెరిస్కోప్ కెమేరాతో లాంచ్ చేయబోతున్నట్లు చెబుతోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజ్ నుండి పెరిస్కోప్ కెమేరా సెటప్ కనిపించేలా అందించిన ఇమేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.

Also Read: Flipkart Republic Day Sale: భారీ డీల్స్ మరియు ఆఫర్లతో వచ్చేస్తోంది.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను xx jan 2024 కి లాంచ్ చేయనున్నట్లు చెబుతోంది. అంటే, ఈ ఫోన్ ను ఈ నెల చివరి నాటికి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజ్ నుండి 200MP కెమేరాతో తీసిన ఫోటోలను రియల్ మి 12 ప్రో పెరిస్కోప్ కెమేరాతో తీసిన ఫోటోలతో పోల్చి చూపిస్తోంది.

Realme 12 Pro Launch with periscope camera

ఇందులో, రియల్ మి 12 ప్రో పెరిస్కోప్ కెమేరాతో తీసినట్లు చెబుతున్న ఫోటోలు చాలా క్లారిటీ మరియు సహజంగా కనిపిస్తున్నాయి. అంటే, ఈ ఫోన్ లో అందించే పెరిస్కోప్ కెమేరా సెటప్ తో మరింత అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించ గలిగే వీలుంటుందని సింబాలిగ్గా కంపెనీ చెబుతోంది.

Realme 12 Pro Launch with periscope sensor

ప్రస్తుతానికి, ఈ ఫోన్ గురించి ఈ విషయాలను మాత్రమే వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటుగా ఈ ఫోన్ యోక్క కీలకమైన ఫీచర్లు మరియు స్పెక్స్ ను కూడా త్వరలోనే రియాల్ మి అందించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo