New Smart Tv: షియోమి రెండు కొత్త స్మార్ట్ 4K Fire Tv లను విడుదల చేసింది..ధర మరియు ఫీచర్స్ ఇవే.!

HIGHLIGHTS

Redmi Smart Fire TV 4K సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది

ఈ స్మార్ట్ టీవీ సిరీస్ నుంచి 43 ఇంచ్ మరియు 55 ఇంచ్ సైజులో టీవీ లను విడుదల చేసింది

ఈ టీవీ లను బెజెల్ లెస్ డిజైన్ మరియు మెటల్ ఫ్రేమ్ తో అందించింది

New Smart Tv: షియోమి ఇండియన్ మార్కెట్లో Redmi Smart Fire TV 4K సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ సిరీస్ నుంచి 43 ఇంచ్ మరియు 55 ఇంచ్ సైజులో ఈ రెండు స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ టీవీ లను బెజెల్ లెస్ డిజైన్ మరియు మెటల్ ఫ్రేమ్ తో అందించింది.

Xiaomi New Smart Tv:

షియోమి రెడ్ మి స్మార్ట్ ఫైర్ టీవీ 4K సిరీస్ నుంచి ఈ స్మార్ట్ టీవీ ధరల విషయానికి వస్తే, ఈ సిరీస్ లో 43 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 24,999 ధరతో, 55 ఇంచ్ టీవీని రూ. 35,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ షియోమి వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

ఆఫర్స్

ఈ స్మార్ట్ టీవీల పై గొప్ప బ్యాంక్ ఆఫర్ లను కూడా షియోమి అందించింది. ఈ టీవీలను ICICI Credit Card EMIs కొనేవారికి రూ. 1,500 తగ్గింపు మరియు ICICI Credit Card ఫుల్ పేమెంట్ చేసే యూజర్లకు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Amazon Kickstarter సేల్ నుంచి iQOO Z7 Pro 5G పై భారీ డీల్ అనౌన్స్.!

Redmi Smart Fire TV 4K : ఫీచర్స్

ఈ రెడ్ మి కొత్త ఫైర్ టీవీలు మెటల్ ఫ్రేమ్ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో వస్తాయి. ఈ టీవీ లో 60Hz రిఫ్రెష్ రేట్ మరియు Vivid Picture Engine సపోర్ట్ తో గొప్ప పిక్చర్ క్వాలిటీ అందించే 4K UHD స్క్రీన్ ను కలిగి వుంది. ఈ టీవీలు బిల్ట్ ఇన్ Fir Tv ఫీచర్ తో వస్తాయి మరియు ఫాస్ట్ స్ట్రీమింగ్ కి గ్యారెంటీ ఇస్తాయి.

ఈ టీవీ లలో 30W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio, dts HD మరియు dts Virtual X సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీలో 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఇందులో, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్, AV ఇన్ పుట్, హెడ్ ఫోన్ జాక్, HDMI 2.1, USB 2.0, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :