కొత్త 32 ఇంచ్ టీవీని రూ.7,999 ధరకే విడుదల చేసిన వెస్టింగ్ హౌస్!!

HIGHLIGHTS

కొత్త బడ్జెట్ టీవీలను వెస్టింగ్ హౌస్ పరిచయం చేసింది

ఈ కొత్త టీవీలను స్మార్ట్ మరియు నాన్ స్మార్ట్ విభాగాల్లో అందించింది

ఈ టీవీలను కేవలం రూ.7,999 ధరలో అందించడం విశేషం

కొత్త 32 ఇంచ్ టీవీని రూ.7,999 ధరకే విడుదల చేసిన వెస్టింగ్ హౌస్!!

ఇండియన్ మార్కెట్లో తన కొత్త బడ్జెట్ టీవీలను వెస్టింగ్ హౌస్ పరిచయం చేసింది. ఈ కొత్త టీవీలను స్మార్ట్ మరియు నాన్ స్మార్ట్ విభాగాల్లో అందించింది. ఈ టీవీలను కేవలం రూ.7,999 ధరలో అందించడం విశేషం. ఈ టీవీలను 32, 43 మరియు 50 పరిమాణంలో HD మరియు UHD రిజల్యూషన్ తో అందించింది. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫీచర్‌ లలో సరికొత్తగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ కొత్త టీవీల విషయానికి వస్తే, 32 ఇంచ్ HD Ready టీవీ నాన్- స్మార్ట్ టీవీ 2 HDMI, 2 USB పోర్ట్‌లతో వస్తుంది. ఈ టీవీ MP3/WMA ఆడియో ఫార్మాట్‌లకు మద్దతు ఇచ్చే ఆడియో ఈక్వలైజర్ ను కలిగివుంది మరియు 20W సౌండ్ అవుట్ ఫుట్ ఇస్తుంది. ఈ టీవీ గరిష్టంగా 350 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు మరియు మంచి పిక్చర్ క్వాలిటీ ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీని కేవలం రూ.7,999 రూపాయల ధరతో అందించింది.    

ఇక 43 మరియు 50 ఇంచ్ టీవీల విషయానికి వస్తే, ఇవి రెండు కూడా 4K UHD రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ టీవీలు. వీటిలో, 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ధర రూ.20,999 రూపాయలు కాగా, 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ధర రూ.27,999 రూపాయలు. ఈ టీవీలు 2GB RAM, 8GB ROM, 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌ లను కలిగి ఉంటాయి. ఈ రెండు టీవీలు కూడా మంచి విజువల్స్ అందించడానికి వీలుగా HDR 10 సపోర్ట్ తో వస్తాయి.

ఇక సౌండ్ పరంగా, ఈ రెండు టీవీలు కూడా డిజిటల్ నాయిస్ ఫిల్టర్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే 40-వాట్ స్పీకర్ అవుట్‌పుట్‌ ను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనిచేస్తాయి మరియు వినియోగదారులు Google Play Store ద్వారా అనేక Apps మరియు Game లకు యాక్సెస్‌ను పొందవచ్చు.

మార్కెట్లోకి లేటెస్ట్ గా వచ్చిన ఈ టీవీలు జూన్ 13 నుండి అమెజాన్‌ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo