Toshiba 4K స్మార్ట్ టీవీ లాంచ్: 4 సంవత్సరాల వారంటీతో వస్తున్నాయి

HIGHLIGHTS

Toshiba, ఈ జపాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ తన 4K స్మార్ట్ టీవీ లను ఇండియాలో విడుదల చేస్తోంది.

ఈ టీవీ లను అత్యధికంగా 4 సంవత్సరాల వారంటీతో విడుదల చేస్తున్నట్లు టీజ్ చేస్తోంది.

ఈ టీవీలకు Dolby Vision మరియు Dolby Atmos వంటి ప్రత్యేకతలను కూడా జత చేసినట్లు తెలిపింది.

Toshiba, ఈ జపాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ తన 4K స్మార్ట్ టీవీ లను ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ టీవీ లను అత్యధికంగా 4 సంవత్సరాల వారంటీతో విడుదల చేస్తున్నట్లు టీజ్ చేస్తోంది. ఈ టీవీలను 4K రేంజ్ లో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. అయితే, ముందుగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వివిధ సైజుల్లో ఈ టీవీలను ప్రకటించే అవకాశం ఉంటుంది.

రేపు విడుదలకానున్న ఈ Toshiba టీవీల గురించి Flipkart ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ని కూడా అందించింది. ఈ పేజ్ ద్వారా అందించిన వివరాల ప్రకారం, ఈ టీవీలను 4K రిజల్యూషన్ మరియు 4 సంవత్సరాల వారంటీ తో ప్రకటించనున్నట్లు చూపిస్తోంది. అలాగే, ఈ టీవీలకు Dolby Vision మరియు Dolby Atmos వంటి ప్రత్యేకతలను కూడా జత చేసినట్లు తెలిపింది.

ఆపరేటింగ్ సిస్టమ్స్ పరంగా, ఈ తోషిబా టీవీలు అంతర్గతంగా అభివృద్ధి చెందిన VIDAA U స్మార్ట్ టీవీ OS యొక్క అప్డేటెడ్ వెర్షన్ లో నడుస్తాయి. ఈ OS ను మొదట Hisense 2014 లో అభివృద్ధి చేసింది. ఎప్పటిలాగే, ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు మరిన్ని వంటి OTT సేవలకు మద్దతు ఇస్తుంది.

అలాగే, మీరు సెప్టెంబర్ 18 మరియు సెప్టెంబర్ 21 మధ్య తోషిబా అల్టిమేట్ 4 కె టివి సిరీస్‌ ను కొనుగోలు చేస్తే, ఈ ప్యానెల్ ‌పైన నాలుగు సంవత్సరాల వారంటీ పొందవచ్చు. ప్రస్తుతానికి, ఏ మోడల్ ధర ఎంతో అనే విషయం తెలియరాలేదు , తోషిబా అల్టిమేట్ 4 కె సిరీస్ 43 అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల మోడళ్లలో వస్తుంది. నాలుగు మోడళ్లు సెప్టెంబర్ 18 న, అంటే రేపు లాంచ్ కానున్నాయి.                                

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :