Great Freedom Sale కంటే ముందు అమెజాన్ భారీ 50 ఇంచ్ Smart Tv డీల్ ప్రకటించింది.!

Updated on 29-Jul-2025
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా Great Freedom Sale ప్రకటించిన విషయం తెలిసిందే

సేల్ మొదలవడానికి ముందే అమెజాన్ ఈరోజు 50 ఇంచ్ Smart Tv డీల్ ఒకటి అందించింది

ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత మొదటి సారిగా చాలా చవక ధరలో లభిస్తోంది

అమెజాన్ ఇండియా Great Freedom Sale ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అమెజాన్ బిగ్ సేల్ జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది మరియు ప్రైమ్ మెంబర్ కోసం 12 గంటల ముందు స్టార్ట్ అవుతుంది. అయితే, ఈ సేల్ మొదలవడానికి ముందే అమెజాన్ ఈరోజు భారీ 50 ఇంచ్ Smart Tv డీల్ ఒకటి అందించింది. అమెజాన్ అందించిన డీల్ తో ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత మొదటి సారిగా చాలా చవక ధరలో లభిస్తోంది.

ఏమిటా 50 ఇంచ్ Smart Tv డీల్?

ప్రముఖ US బేస్డ్ గ్లోబల్ టూల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ కంపెనీ BLACK+DECKER ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రూ. 31,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీని రూ. 3,000 భారీ డిస్కౌంట్ తో రూ. 2,8999 రూపాయల ధరకు ఆఫర్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ రెండు ఆఫర్లు అందుకుంటే ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ టీవీ పై బ్యాంక్ డిస్కౌంట్ అందుకోవాలంటే Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. Buy From Here

Also Read: iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బిగ్ డీల్.!

BLACK+DECKER (50) Smart Tv: ఫీచర్లు

ఈ బ్లాక్ ప్లస్ డెకార్ స్మార్ట్ టీవీ AI ఇంటిగ్రేటెడ్ చిప్ సెట్ (A75x2 + A55x2) తో పని చేస్తుంది. ఇది AI ఇమేజ్ ప్రోసెస్ చేస్తుంది మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ ను కలిగి ఉంటుంది. అదనంగా, ఈ టీవీ 120Hz VRR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 36W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ టీవీలో హై ఫెడిలిటీ స్పీకర్లు మరియు 5 ప్రీ సెట్ స్మార్ట్ ఈక్వలైజర్ సెటప్ కూడా ఇందులో జత చేసింది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ HDMI, AV, RF, ఈథర్నెట్, USB, హెడ్ ఫోన్ వంటి పోర్ట్ సపోర్ట్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 2-వే బ్లూటూత్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :