End of Season Sale బెస్ట్ QLED స్మార్ట్ టీవీ డీల్స్ పై ఒక లుక్కేయండి.!

Updated on 09-Jun-2025
HIGHLIGHTS

End of Season Sale నుంచి ఈరోజు బెస్ట్ QLED స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ప్రకటించింది

ఈ సేల్ మే 30 వ తేదీ ప్రకటించిన ఈ సేల్ ఇంకా ముగియలేదు

ఈ సేల్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది

Flipkart రీసెంట్ గా ప్రకటించిన సేల్ End of Season Sale నుంచి ఈరోజు బెస్ట్ QLED స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ప్రకటించింది. ఈ సేల్ మే 30 వ తేదీ ప్రకటించిన ఈ సేల్ ఇంకా ముగియలేదు. ఈ సేల్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఈ ఆఫర్ తో 23 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ని మీ సొంతం చేసుకునే అవకాశం అందించింది. మరి ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేయండి.

End of Season Sale: ఏమిటా QLED స్మార్ట్ టీవీ ఆఫర్?

ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి Thomson 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై బెస్ట్ డీల్ అందించింది. డీల్ ఏమిటంటే ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 50% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది.

ఈ 50 ఇంచ్ థాంసన్ స్మార్ట్ టీవీని HDFC పిక్సెల్ క్రెడిట్ కార్డు మరియు BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 23,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఇది 2022 మోడల్ కోసం నిర్ణయించిన ధర. అయితే, 2025 కొత్త మోడల్ మాత్రం అన్ని ఆఫర్స్ తో కలుపుకొని రూ. 24,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. అయితే, 2025 మోడల్ ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టాక్ గా ఉంది.

Also Read: Dolby Atmos Soundbar: భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ డీల్స్ ఇవే.!

Thomson (50) QLED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10+ మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి బ్రైట్నెస్ కూడా అందిస్తుంది.

సౌండ్ పరంగా ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో టోటల్ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉంటాయి. ఈ టీవీ బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB మరియు AV in వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ డీల్ ను కూడా పరిశీలించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :