take a look on best 43 inch 4k smart tv deal around 17k today
ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. చౌక ధరలో ఇంటికి తగిన పెద్ద 43 ఇంచ్ 4K Smart Tv కొనాలని చూస్తున్న వారు పరిశీలించ తగిన స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూసేద్దామా.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క సబ్ బ్రాండ్ iFFALCON అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (iFF43U64) ఈ రోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 62% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 18,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది.
అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం 17 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. అవేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని HDFC మరియు BOBCARD ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, Axis మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్స్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: బిగ్ డీల్స్ తో 8 వేలకే లభిస్తున్న Dolby Atmos సౌండ్ బార్.!
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ మరియు HDR10 సపోర్ట్ తో వస్తుంది. ఇందులో ఆకట్టుకునే విజువల్స్ ను చూడవచ్చు. అయితే, ఇది 260 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి వెలుగు ఎక్కువ ఉండే ఏరియాలో కొంచెం డల్ గా కనిపిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ఇంటిగ్రేటెడ్ బాక్స్ స్పీకర్లు కలిగి 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఇందులో 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ టీవిలో HDMI, USB, బ్లూటూత్, ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.