onida 55 inch smart tv today available at reasonable price in online
ONIDA 55 ఇంచ్ Smart Tv ఈరోజు డిస్కౌంట్ ఆఫర్స్ తో రీజనబుల్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ పై నుంచి కూడా రీజనబుల్ ధరలో లభిస్తుంది. స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా ఈరోజు 30 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను.
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి 34 నుంచి 35 శాతం తగ్గింపుతో రూ. 29,990 రూపాయల ధరలో లిస్ట్ అయ్యింది. అయితే, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ కూడా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించాయి. అందుకే, ఈ టీవీ మరింత తక్కువ ధరలో లభిస్తుంది. ఈ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Federal, HSBC మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 28,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
Also Read: TikTok Come Back: ఇండియాలో టిక్ టాక్ మళ్ళీ తిరిగొస్తోందా?
ఈ ఒనిడా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన ఎల్ఈడి ప్యానెల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్టుతో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ ఒనిడా 55 ఇంచ్ టీవీ Nexg ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2జిబి ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో పిక్సా విజువల్ ఇంజిన్ మరియు NEXg కెమెరా సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఒనిడా 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు ఇన్ బిల్ట్ స్పీకర్లను కలిగి టోటల్ 24 వాట్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, బ్లూటూత్, AV in, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు మీకు మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.