జూలై 4న కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!

జూలై 4న కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!
HIGHLIGHTS

వన్ ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ప్రకటించింది

OnePlus 50 Y1S Pro 4K UHD స్మార్ట్ టీవీ లాంచ్ డేట్

జూలై 4 న వస్తున్న వన్ ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ

వన్ ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ప్రకటించింది. OnePlus 50 Y1S Pro 4K UHD స్మార్ట్ టీవీ ని జూలై 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు లాంచ్ డేట్ ప్రకటించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లను కూడా టీజర్ పేజ్ ద్వారా అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఇటీవల బడ్జెట్ ధరలో 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని తీసుకువచ్చిన అదే  Y1S Pro సిరీస్ నుండి తీసుకువస్తోంది.      

ఇక స్మార్ట్ టీవీ వివరాల్లోకి వెళితే, వన్ ప్లస్ ప్రస్తుతానికి ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం వెల్లడించింది. ఈ వెల్లడించిన ఫీచర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ దాదాపుగా దీనికి ముందుగా వచ్చిన 43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది. అయితే, మరిన్ని కొత్త ఫీచర్లను జత చేసినట్లు కూడా కనిపిస్తోంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ HDR 10 Decoding మరియు అతిసన్నని అంచులు (బెజెల్ లెస్) డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ AI-Powered విజువల్స్ ను అందిస్తుంది. అంటే, MEMC, డైనమిక్ కాంట్రాస్ట్, కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి వాటి సహాయంతో గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ని మరింత పెంచడానికి స్మార్ట్ మేనేజ్మెంట్ అప్షన్ ను కూడా జతచేసినట్లు చెబుతోంది. 

ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 24W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుందని వన్ ప్లస్ టీజర్ ద్వారా వేల్లడించింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo