ఈరోజు చవక ధరలో కొత్త QLED స్పెషల్ ఎడిషన్ Smart TV లను లాంచ్ చేసిన Kodak

Updated on 09-Jul-2025
HIGHLIGHTS

Kodak ఈరోజు 24, 32 మరియు 40 ఇంచ్ సైజుల్లో ఈ మూడు Smart TV లను విడుదల చేసింది

ఈ మూడు టీవీలు కూడా చాలా చవక ధరలో QLED స్క్రీన్ తో లాంచ్ అయ్యాయి

ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా స్లీక్ మరియు బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటాయి

ప్రముఖ స్మార్ట్ టీవీ టీవీ బ్రాండ్ Kodak ఈరోజు తన పాపులర్ స్పెషల్ ఎడిషన్ సిరీస్ నుంచి ఇండియన్ మార్కెట్లో మూడు కొత్త Smart TV లు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి 24, 32 మరియు 40 ఇంచ్ సైజుల్లో ఈ మూడు స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ మూడు టీవీలు కూడా చాలా చవక ధరలో QLED స్క్రీన్ తో లాంచ్ అయ్యాయి. కోడాక్ సరికొత్తగా విడుదల చేసిన ఈ మూడు స్మార్ట్ టీవీల ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Kodak QLED Special Edition Smart TV

కోడాక్ ఈరోజు స్పెషల్ ఎడిషన్ సిరీస్ నుంచి 24 ఇంచ్ 32 ఇంచ్ మరియు 40 ఇంచ్ టీవీలు అందించింది. ఈ స్మార్ట్ టీవీ ప్రైస్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.

కోడాక్ 24 ఇంచ్ టీవీ ప్రైస్ : రూ. 6,399

కోడాక్ 32 ఇంచ్ టీవీ ప్రైస్ : రూ. 8,499

కోడాక్ 40 ఇంచ్ టీవీ ప్రైస్ : రూ. 13,499

ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా 12వ తేదీ మొదలయ్యే Flipkart GOAT Sale నుంచి ప్రత్యేకంగా సేల్ కి అందుబాటులోకి వస్తాయని కోడాక్ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీల అపి ఫ్లిప్ కార్ట్ సేల్ నుసి గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ లపై Axis, HDFC మరియు IDFC బ్యాంక్ కార్డు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

Also Read: OnePlus Nord 5: భారీ ఆఫర్స్ తో మొదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ సేల్.!

Kodak QLED Smart TV : ఫీచర్స్

ఈ సిరీస్ నుంచి కోడాక్ అందించిన మూడు స్మార్ట్ టీవీలు కూడా క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. అయితే, 24 మరియు 32 ఇంచ్ టీవీలు HD Ready రిజల్యూషన్ కలిగి ఉంటే, 40 ఇంచ్ టీవీ మాత్రం FHD రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా స్లీక్ మరియు బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటాయి. అలాగే, ఈ మూడు స్మార్ట్ టీవీలు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తాయి మరియు Linux ఆధారిత OS పై నడుస్తాయి.

ఈ మూడు కొత్త టీవీలలో 32 ఇంచ్ మరియు 40 ఇంచ్ రెండు టీవీలు కూడా 36W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లు కలిగి ఉంటాయి. ఈ టీవీలు HDMI, USB, Wi-Fi మరియు Miracast అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటాయి. ఈ టీవీలు జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, జీ 5, సోనీ లివ్ మరియు యూట్యూబ్ వంటి అన్ని యాప్స్ కి సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :