Kodak launches big Mini QD Smart Tv under reasonable price with stunning features
Kodak ఇండియన్ మార్కెట్లో కొత్తగా Mini QD Smart Tv ని బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ 6 స్పీకర్లు కలిగి గొప్ప సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన గొప్ప Mini QD 4K స్క్రీన్ కలిగి ఉంటుంది. కొడాక్ అందించిన లేటెస్ట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకుందామా.
కొడాక్ ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 57,999 ధరతో విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ కొడాక్ బిగ్ స్మార్ట్ టీవీ స్లీక్ బెజెల్ లెస్ డిజైన్‌తో పాటు మెటల్ బేస్ తో ప్రీమియమ్ లుక్‌ను అందిస్తుంది. 1.1 బిలియన్‌కు పైగా రంగులు మరియు అల్ట్రా వైడ్ కలర్ గామట్‌ను సపోర్ట్ చేసే Mini QD 4K డిస్‌ప్లే తో ఈ టీవీ వస్తుంది. ఈ టీవీ గరిష్టంగా 1500 నిట్స్ బ్రైట్నెస్, HDR10, డాల్బీ విజన్ సపోర్ట్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందించే సెటప్ కలిగి ఉంటుంది. ఈ టీవీ MediaTek క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఆడియో పరంగా గొప్ప సెటప్ కలిగి ఉంటుంది. ఈ టీవీలో మొత్తం 6 స్పీకర్లు ఉంటాయి. ఇందులో 2 సబ్ ఉఫర్లు, 2 స్కై సబ్ ఉఫర్లు కూడా కలిగి ఉండి, టోటల్ 108W ఆడియో అవుట్ పుట్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుందని కొడాక్ తెలిపింది.
Also Read: Realme P4 Lite: రియల్‌మీ బడ్జెట్ బిగ్ బ్యాటరీ ఫోన్ ఫస్ట్ సేల్.!
ఈ స్మార్ట్ టీవీ బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi (2.4 + 5 GHz) సపోర్ట్, HDMI Arc, USB, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ తో వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ సపోర్ట్ కూడా అందిస్తుంది. బిల్ట్ ఇన్ Chromecast అండ్ Apple AirPlay సపోర్ట్ తో ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ పరికరాల నుంచి కంటెంట్‌ను సులభంగా మిర్రర్ చేయవచ్చు.