Jio Plans: జియో యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలను చవక ధరలో అందించే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

జియో యూజర్లకు గొప్ప లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తోంది

వీటిలో రెండు ప్లాన్స్ మాత్రం చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ గా నిలుస్తాయి

ఈ రెండు ప్లాన్ లను రీసెంట్ గా అనౌన్స్ చేసింది మరియు ఈ ప్లాన్స్ యూజర్స్ కి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి

Jio Plans: రిలయన్స్ జియో యూజర్లకు గొప్ప లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తోంది. వీటిలో రెండు ప్లాన్స్ మాత్రం చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు ప్లాన్ లను కూడా జియో రీసెంట్ గా అనౌన్స్ చేసింది మరియు ఈ ప్లాన్స్ యూజర్స్ కి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. జియో యూజర్లకు అందించిన ఈ రెండు బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

Jio Plans: ఏమిటా రెండు జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్?

రిలయన్స్ జియో కొత్తగా ప్రకటించిన రూ. 899 మరియు రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఈ కోవకే చెందుతాయి. ఎందుకంటే, ఈ రెండు ప్లాన్స్ కూడా రూ. 1,000 కంటే తక్కువ ధరలో మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. అది కూడా 5G స్పీడ్ తో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి.

రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే బెనిఫిట్స్ చూస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీకి గాను 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ లాభాలను అందిస్తుంది. అదే 4G నెట్ వర్క్ అయితే, డైలీ 2GB హై స్పీడ్ 4జి డేటా మరియు 20 GB అదనపు డేటా కూడా అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో రోజుకు 100 SMS వినియోగ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ 98 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియో యూజర్లు 98 రోజుల పాటు 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఒకవేళ 4G నెట్ వర్క్ అయితే డైలీ 2GB హై స్పీడ్ 4జి డేటా లభిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 1000 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుతుంది.

Also Read: Lava AGNI 3: సరికొత్త డిజైన్, స్టన్నింగ్ కెమెరా మరియు కష్టమైజబుల్ యాక్షన్ బటన్ తో వస్తోంది.!

పైన తెలిపిన ఈ రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ తో జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

మరిన్ని రీఛార్జ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :