భారత్ మార్కెట్లో కొత్త QLED Smart TV లు విడుదల చేసిన జపాన్ బ్రాండ్ AKAI

Updated on 29-Aug-2025
HIGHLIGHTS

ఫేమస్ జపాన్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్ లో కొత్త QLED Smart TV లు విడుదల చేసింది

ఇందులో 43 ఇంచ్ మరియు 75 ఇంచ్ రెండు స్మార్ట్ స్మార్ట్ టీవీలను అందించింది

ఈ టీవీలు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం తో నడుస్తాయి

ఫేమస్ జపాన్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్ లో కొత్త QLED Smart TV లు విడుదల చేసింది. ఇందులో 43 ఇంచ్ మరియు 75 ఇంచ్ రెండు స్మార్ట్ స్మార్ట్ టీవీలను అందించింది. ఈ టీవీలు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం తో నడుస్తాయి మరియు చాలా స్లీక్ డైజిన్ తో వచ్చాయి. ఈ కొత్త స్మార్ట్ టీవీ ప్రైస్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.

AKAI Smart TV : ప్రైస్

అకాయ్ కొత్తగా విడుదల చేసిన ఈ టీవీలలో 43 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 28,490 రూపాయల ధరతో మరియు 75 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 86,490 రూపాయల ధరతో అందించింది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా అకాయ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులో ఉన్నాయి.

AKAI Smart TV : ఫీచర్స్

ఈ అకాయ్ స్మార్ట్ టీవీలు 4K రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటాయి. ఈ రెండు టీవీలు కూడా డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా లేటెస్ట్ మీడియాటెక్ క్వాడ్ కోర్ తో పని చేస్తాయి మరియు 2 జీబీ ర్యామ్ తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఆండ్రాయిడ్ టీవీ OS (ఆండ్రాయిడ్ 14) తో పని చేస్తాయి.

ఇక ఈ రెండు స్మార్ట్ టీవీలు కలిగిన సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇందులో గేమింగ్ మోడ్ తో 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఇక కనెక్టివిటీ పరంగా ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా HDMI, USB, AV ఇన్, డ్యూయల్ బ్యాండ్ Wi – Fi, బ్లూటూత్, మిరా కాస్ట్, క్రోమ్ కాస్ట్ వంటి కనెక్టివిటీ మరియు ఫాస్ట్ బూట్, చైల్డ్ లాక్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: EPFO 3.0: మరింత వేగవంతమైన సేవల కోసం కొత్త సర్వీస్.. UPI తో కూడా విత్ డ్రా అవకాశం.!

ఇదే సిరీస్ నుంచి 32 ఇంచ్ HD స్మార్ట్ టీవీ కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 13,990 ప్రైస్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ టీవీలు ఇప్పుడు సేల్ కి అందుబాటులో ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :