Flipkart Sale: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!

Flipkart Sale: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!
HIGHLIGHTS

బిగ్ బచాత్ ధమాల్ సేల్ ను తీసుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్

Flipkart Sale నుండి భారీ డిస్కౌంట్ తో 25 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్

OTT ప్లాట్ ఫామ్స్ పుణ్యాన ఇప్పుడు పెద్ద టీవీల హవా ఎక్కువగా నడుస్తోంది

ప్రతినెల మాదిరిగానే ఈ నెల కూడా బిగ్ బచాత్ ధమాల్ సేల్ ను తీసుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ Flipkart Sale నుండి భారీ డిస్కౌంట్ తో 25 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఆఫర్ ను అందించింది. OTT ప్లాట్ ఫామ్స్ పుణ్యాన ఇప్పుడు పెద్ద టీవీల హవా ఎక్కువగా నడుస్తోంది. ఈ ట్రెండ్ కు తగినట్లుగానే ఈ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అందించింది. పెద్ద స్మార్ట్ టీవీ ని 25 వేల బడ్జెట్ లో కొనాలని చూస్తున్నట్లయితే, ఈ ఫ్లిప్ కార్ట్ డీల్ పైన ఒక లుక్కేయండి.

Flipkart Sale Smart Tv Offer

ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుండి ఈ బిగ్ బచాత్ ధమాల్ సేల్ ను లైవ్ చేసింది మరియు ఈ సేల్ జనవరి 7న ముగుస్తుంది. ఈ సేల్ నుండి ఈరోజు ఇఫాల్కన్ బ్రాండ్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ iFFALCON by TCL U62 ని 64% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Baroda Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 2,000 అధనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది.

అంతేకాదు, HDFC,ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో ఈ టీవీని కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ ను అందిస్తోంది.

Also Read : Oppo Reno11 Series: 32MP టెలీఫోటో పోర్ట్రైట్ కెమేరా తో వస్తోంది.!

iFFALCON by TCL U62 (55inch) ప్రత్యేకతలు

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Google TV OS పైన పని చేస్తుంది మరియు 2GB & 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఐఫాల్కన్ టీవీ 3 HDMI, 1, USB, 3.5 జాక్ పోర్ట్, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. మంచి కలర్స్ అందించడానికి వీలుగా HDR 10 సపోర్ట్ మరియు డైనమిక్ కలర్ ఎన్హెన్స్ మెంట్ ఫీచర్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది.

Flipkart Sale 55 inch smart tv Deal

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలో Dolby Audio సపోర్ట్ వుంది. అలాగే, 24W పెద్ద సౌండ్ అందించ గల స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ డిజైన్ పరంగా కూడా చాలా సన్నని అంచులతో వస్తుంది మరియు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo