Flipkart Sale offers big discount on these QLED Smart TV from big saving days sale
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ టీవీ ల పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందిస్తోంది. అందుకే, ఈ Flipkart Sale నుండి భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న పెద్ద QLED Smart TV ఆఫర్ ను గురించి ఈరోజు చూడనున్నారు. ఈ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, LED టీవీ రేటుకే పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని అందుకోవచ్చని చెప్పవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈరోజు Thomson Phoenix స్మార్ట్ టీవీ సిరీస్ యొక్క 43 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ Q43H1110 పై Flipkart ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 34% డిస్కౌంట్ తో రూ. 20,999 రూపాయలకే అందిస్తోంది. అంతేకాదు, ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని SBI Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: Airtel ధమాకా ఆఫర్: తక్కువ ధరలో Netflix OTT తో కొత్త ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!
థాంసన్ బ్రాండ్ యొక్క ఈ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ చాలా సన్నని ఎడ్జ్ కలిగిన అంచులతో వస్తుంది. ఈ థాంసన్ ఫీనిక్స్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 3 HDMI, 2 USB, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు Bluetooth వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
ఈ థాంసన్ టీవీ MediaTek క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB RAM మరియు 16GB స్టోరేజ్ తో మంచి పెర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది.ఈ స్మార్ట్ టీవీలో 40W సౌండ్ అందించే స్పీకర్ల ఉన్నాయి. అలాగే, ఈ టీవీ Dolby Atmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 20 వేల బడ్జెట్ లో తగైన్ ఫీచర్స్ ను మరియు స్పెక్స్ ను కలిగి ఉంటుంది. ఈ సేల్ నుండి అందించిన బ్యాంక్ ఆఫర్ తో ఈ టీవీ ని 20 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.