Flipkart Sale offers big deals on latest 43 inch 4K Dolby Smart Tv
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ అనౌన్స్ చేసింది. Flipkart Sale నుంచి కేవలం 14 వేలకే 43 ఇంచ్ 4K Dolby Smart Tv అందుకోండి, అని ఈరోజు ప్రకటించింది. ఈ బిగ్ సేల్ నుంచి ఈరోజు లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్ లో చెప్పుకోదగిన డీల్ గా ఇది నిలుస్తుంది. కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో బ్రాండ్ న్యూ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం గా ఉంటుంది.
ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి ఈరోజు ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. డీల్ విషయానికి వస్తే, Kenstar రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ (43UHDTDKEETB) పై 64% అతి భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 15,839 రూపాయల ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లిస్ట్ అవుట్ చేసింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 14, 339 రూపాయల ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రైస్ లో ఇది అతి చవక ధరలో లభించే 43 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది.
ఈ కెన్ స్టార్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10 వంటి ఫీచర్స్ తో తగిన విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 1.5 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ మరియు ఆకర్షణీయమైన స్టాండ్ తో వస్తుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ కలిగిన రెండు స్పీకర్లతో టోటల్ 24W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీలో ఉన్న మరో ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, ఈ టీవీ Samsung యొక్క Tizen OS తో పని చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, HDMI, ఆప్టికల్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Also Read: Sony Dolby Audio సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో 7 వేలకే ఆఫర్ చేస్తున్న అమెజాన్.!
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.