Flipkart Sale offers big deal on Sony Smart Tv today 10 April 2024
Sony Smart Tv పైన Flipkart Sale జబర్దస్త్ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన ‘Mega Saving Days’ సేల్ నుండి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన ఈ సేల్ నుండి ప్రపంచ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ బ్రాండ్ స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్ లతో అధనపు తగ్గింపును కూడా అందుకోవచ్చు. ఫ్లయ్ కార్ట్ సేల్ నుండి లభితున్న ఈ బెస్ట్ సోనీ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.
ఫ్లిప్ కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ నుండి ఈరోజు సోనీ యొక్క 55 ఇంచ్ SONY Bravia X74K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74K స్మార్ట్ టీవీ 47% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ రూ. 52,490 ఆఫర్ ధరతో లిస్ట్ చెయ్యబడింది. HDFC Bank Credit Card EMI ఆప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాదు, ఈ టీవీ తో జతగా సౌండ్ బార్ ను కొనుగోలు చేస్తే రూ. 5,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్ లిస్ట్ లో తెలిపింది. అలాగే, HDFC Bank Debit Card EMI ఆప్షన్ తో ఈ టీవీ కొనే వారికి రూ. 2000 తగ్గింపు లభిస్తుంది.
ఇక ఇతర బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ పైన అన్ని బ్యాంక్ కార్స్ పైన రూ. 1,000 రూపాయల తగ్గింపు ఆఫర్ ను కూడా ఆఫర్ చేస్తోంది.
Also Read: Xiaomi Fan Festival Sale నుండి 13 సిరీస్ ఫోన్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి.!
ఈ సోనీ స్మార్ట్ టీవీ Ultra HD 4K (3840 x 2160) రిజల్యూషన్ అందించ గల 55 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ సోనీ టీవీ 4K processor X1 తో వస్తుంది మరియు 4K X-Reality PRO అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ లో అందించిన Live Color ఫీచర్ తో గొప్ప రిచ్ కలర్ లను కూడా అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా, ఈ సోనీ స్మార్ట్ టీవీలో HDMI, USB, Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. సోనీ ఈ స్మార్ట్ టీవీని Dolby Audio సపోర్ట్ కలిగిన 20 W ఓపెన్ బఫెల్ స్పీకర్లతో ఈ టీవీని అందించింది.
బడ్జెట్ ధరలో సోనీ బ్రాండ్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారికి ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తున్న ఈ డీల్ మంచి ఆఫర్ అవుతుంది.