Flipkart Sale offers 43 inch 4k smart tv at 32 inch tv price today
Flipkart Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ఒకటి అందించింది. 2025 సంవత్సరం విడుదలైన లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీని ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు అంటే, కేవలం 32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K Smart TV ని మీరు అందుకోవచ్చు. అదిరింది కదా డీల్, మరి ఆ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో తెలుసుకుందామా.
TCL యొక్క సబ్ బ్రాండ్ iFFALCON యొక్క 43 ఇంచ్ టీవీ ఈరోజు ఈ బెస్ట్ బడ్జెట్ ప్రైస్ తో లభిస్తుంది. డీల్ వివరాల్లోకి వెళితే, ఐఫాల్కన్ యొక్క 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43U65 ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 66% భారీ డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
దీనికి అదనంగా ఈ స్మార్ట్ టీవీ పై SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 15,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. కొత్త GST రూల్స్ తో ఈ టీవీలు ఇంత తక్కువ ధరకు లభిస్తున్నాయని కూడా మనం గుర్తు చేసుకోవాలి.
Also Read: మీ బెడ్ రూమ్ ని స్వచ్ఛమైన ఎయిర్ తో నింపే బడ్జెట్ Air Purifier కోసం చూస్తున్నారా.!
ఐఫాల్కన్ యొక్క ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తోపాటు 16 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ డాల్బీ విజన్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ లో అందించిన రెండు స్పీకర్లతో 24W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది ప్రీమియం మెటల్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు దాదాపు అంచులు లేని విధంగా డిజైన్ చేయబడింది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, HDMI మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్స్ కలిగి ఉంటుంది.