flipkart offers huge discount on branded 50 inch smart tv from big bachat days sale
Smart Tv : ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. ఇప్పటికే దీపావళి 2024 సేల్ కోసం అనేక భారీ ఆఫర్లు అందించిన ఫ్లిప్ కార్ట్, ఈరోజు కూడా ఈ సేల్ నుంచి భారీ డీల్స్ అందించింది. అందులో, ఒక డీల్ బాగా ఆకర్షించేలా వుంది. అదేమిటంటే, ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే 25 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ బ్రాండెడ్ QLED స్మార్ట్ టీవీ డీల్. బడ్జెట్ ధరలో కొత్త టీవీ కొనడానికి చూస్తుంటే, ఈ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేయండి.
Thomson ఇండియాలో అందించిన లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ సిరీస్ నుంచి అందించిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (Q50H1000) పై ఈరోజు ఈ డీల్ అందించింది. ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 44% భారీ డిస్కౌంట్ తో రూ. 27,999 ధరకే ల్యాబ్ లభిస్తుంది.
అయితే, HDFC Bank Credit Card EMI ఆప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి గరిష్టంగా రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డీల్ తో ఈ టీవీ ని మరింత చవక ధరకు అందుకోవచ్చు. దాదాపుగా, ఈ స్మార్ట్ టీవీ ని 26 వేల రూపాయల్ బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకునే వీలుంది.
Also Read: New Scam Alert: పెళ్లి కార్డు ముసుగులో కొత్త స్కామ్ లకు తెరలేపిన స్కామర్లు.!
ఈ థాంసన్ 50 క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2GB ర్యామ్ తో పని చేస్తుంది 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDMI Arc, బ్లూటూత్ 5.0, ఈథర్నెట్, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ Dolby Digital Plus సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈరోజు ఈ టీవీ ని మంచి ఆఫర్ ధరకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.