flipkart offers heavy discount offer on latest 65 inch 4K Smart Tv
ఇప్పటి దాకా చిన్న టీవీలు వాడి ఇప్పుడు పెద్ద స్మార్ట్ టీవీ కోసం అప్గ్రేడ్ కోసం చూసే వారికి లేదా బడ్జెట్ ధరలో పెద్ద టీవీ కోరుకునే వారికి ఈరోజు ఒక బిగ్ డీల్ అందుబాటులో వుంది. ఈ డీల్ గురించి సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv అందుకోవచ్చని తడుముకోకుండా చెప్పవచ్చు.
realme TechLife రీసెంట్ గా తీసుకు వచ్చిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఈ డీల్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 52% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు రూ. 40,999 రూపాయల ధరకే లభిస్తుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 38,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. వాస్తవానికి, ఈ ధరలో 55 ఇంచ్ టీవీలు లభిస్తుండగా, ఈ టీవీ మాత్రం 65 ఇంచ్ లో లభిస్తుంది.
Also Read: డ్యూయల్ సబ్ ఉఫర్ తో బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ 5.2 Dolby Soundbar డీల్స్.!
ఈ రియల్ మీ టెక్ లైఫ్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 ఫీచర్ మరియు MEMC టెక్నాలజీతో మంచి స్మూత్ విజువల్స్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ 350 ని ట్స్ పీక్ బ్రైట్నెస్ మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి వెలుగు ఎక్కువ పడే ప్రాంతాల్లో కొంచెం డల్ గా కనిపిస్తుంది. అయితే, లివింగ్ రూమ్ డార్క్ ప్లేస్ గొప్ప కలర్స్ మరియు విజువల్స్ ఆఫర్ చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగిన రెండు స్పీకర్లు కలిగి 40W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB మరియు 32GB బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.