లేటెస్ట్ Xiaomi బిగ్ 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Xiaomi బిగ్ 4K Smart Tv పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది ఫ్లిప్ కార్ట్

ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10 సపోర్ట్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది

ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది

Xiaomi బిగ్ 4K Smart Tv పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది ఫ్లిప్ కార్ట్. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10 సపోర్ట్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చాలా చవక ధరలో కూడా లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ అతిపెద్ద స్మార్ట్ టీవీ డీల్ వివరాలు ఏమిటో చూసేద్దామా.

Xiaomi 4K Smart Tv : డీల్

షియోమీ ఇటీవల 4K టీవీ ఎక్స్ సిరీస్ నుంచి ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 41% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 26,499 రూపాయల అతి తక్కువ ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,750 రూపాయల SBI క్రెడిట్ కార్డు ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది.

అంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ షియోమీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అందించిన అన్ని ఆఫర్స్ తో ఈ టీవీ మీకు కేవలం రూ. 23,749 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ లో మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Also Read: Nothing Phone 4a ఫోన్ పై పరదా తీసిన నథింగ్.. ఫోన్ ఎలా ఉందంటే.!

Xiaomi (50) 4K Smart Tv : ఫీచర్స్

ఈ షియోమీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు MEMC వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో, డీటీఎస్ : x సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :