భారీ డిస్కౌంట్ తో 50 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 65 ఇంచ్ QLED Smart Tv.!

Updated on 01-Feb-2025
HIGHLIGHTS

స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది

ఈ ధమాకా ఆఫర్ ను ఈరోజు Flipkart Big Bachat Sale నుంచి అందించింది

ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ పై ఒక లుక్కేయండి

బడ్జెట్ ధరలో పెద్ద 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ధమాకా ఆఫర్ ను ఈరోజు Flipkart Big Bachat Sale నుంచి అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ తో కేవలం 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకోవచ్చు. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తున్న వారిలొ మీరు కూడా ఉన్నట్లయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ పై ఒక లుక్కేయండి.

Flipkart 65 ఇంచ్ QLED Smart Tv ఆఫర్

మోటోరోలా యొక్క EnvisionX సిరీస్ నుంచి అందించిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 72% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ భారీ డిస్కౌంట్ తో ఈ మోటోరోలా 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 38,990 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, బ్యాంక్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని మా`మరింత చవక ధరకు అందుకోవచ్చు.

ఈ మోటోరోలా 65 ఇంచ్ స్మార్ట్ టీవీని BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఏ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 36,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

Also Read: ఈ Jio Best 5G Plan నెలకు కేవలం రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.!

MOTOROLA EnvisionX (65) Smart TV : ఫీచర్స్

ఈ మోటోరోలా క్యూలెడ్ స్మార్ట్ టీవీ UHD (4K) (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 65 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision మరియు HDR 10 టెక్నాలజీ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో మరియు 16GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ Dolby Atmos, Dolby Digital మరియు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 24W సౌండ్ అందించే రెండు స్పీకర్లతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ,లను ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :