సేల్ కంటే ముందే LG Nanocell Smart Tv పై బిగ్ డీల్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
LG Nanocell Smart Tv స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
ఈ స్మార్ట్ టీవీ అద్భుతమైన విజువల్స్ అందించే నానో సెల్ ప్యానల్ కలిగి ఉంటుంది
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ ను అందించింది
LG Nanocell Smart Tv స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ అద్భుతమైన విజువల్స్ అందించే నానో సెల్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది స్మార్ట్ టీవీ 2025 లో లేటెస్ట్ గా ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.
SurveyLG Nanocell Smart Tv : ఆఫర్
ఎల్ జీ లేటెస్ట్ గా విడుదల చేసిన 2025 మోడల్ 55 ఇంచ్ నానో సెల్ స్మార్ట్ టీవీ (55NANO85A6A) పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ రూ. 59,999 రూపాయల ధరతో 2025 ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 4,500 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 55,499 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అజిత్ చేసింది. అదేమిటంటే, ఈ ఎల్ జీ 55 ఇంచ్ నానో సెల్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC క్రెడిట్ కార్డు తో తీసుకుంటే రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ మీకు కేవలం రూ. 53,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: Realme 16 Pro First Sale: భారీ ఆఫర్స్ తో రియల్ మీ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!
LG Nanocell Smart Tv : ఫీచర్స్
ఈ ఎల్ జీ నానో సెల్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన నానో సెల్ ప్యానల్ LED కలిగి ఉంటుంది. ఇది ప్రామాణిక LED తో ఎక్కువ ఆకర్షణీయమైన మరియు నాచురల్ కలర్స్ అంది అందిస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో మరింత స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. అదనంగా ఈ టీవీ కలిగిన HDR10, HLG మరియు 4K అప్ స్కేలింగ్ తో తక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియోలను సైతం 4K కి దగ్గరగా చూపిస్తుంది. ముఖ్యంగా, ఈ టీవీ α7 AI Processor 4K Gen8 కలిగిన ప్రోసెసర్ ఈ టీవీని వీడియో విజువల్స్ మరియు ఆడియో ని మరింత ఉన్నతంగా చేస్తుంది.
ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W ఔట్‌పుట్ అందిస్తుంది. ఆడియోను బాగా ప్రాసెస్ చేసి స్పష్టమైన మాటలు మరియు మెరుగైన బాస్ అందించే AI Sound Pro ఫీచర్ ఉంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది 3D సౌండ్ ఎఫెక్ట్‌తో సినిమాటిక్ ఆడియో అనుభవం అందిస్తుంది.
ఈ టీవీ webOS (సింపుల్ & ఫాస్ట్ ఇంటర్‌ఫేస్) పై నడుస్తుంది మరియు మ్యాజిక్ AI రిమోట్ తో వస్తుంది. ఇది AI వాయిస్ సెర్చ్, వాయిస్ కంట్రోల్ మరియు మౌస్ లాగానే పాయింట్ అండ్ క్లిక్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.