Best Tv Deal: కేవలం 55 ఇంచ్ టీవీ ప్రైస్ లో 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

Updated on 21-Nov-2025
HIGHLIGHTS

దేశంలో స్మార్ట్ టీవీ ధరలు నానాటికీ మరింత తగ్గుముఖం పడుతున్నాయి

డిస్కౌంట్ ఆఫర్ తో ఇప్పుడు స్మార్ట్ టీవీలు చాలా చవక ధరలో లభిస్తున్నాయి

మీరు కేవలం 55 ఇంచ్ టీవీ ప్రైస్ లో 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోవచ్చు

Best Tv Deal: దేశంలో స్మార్ట్ టీవీ ధరలు నానాటికీ మరింత తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త GST 2.0 టాక్స్ విధానం మరియు ఈ కార్ట్ కంపెనీలు అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ తో ఇప్పుడు స్మార్ట్ టీవీలు చాలా చవక ధరలో లభిస్తున్నాయి. ఈరోజు చవక ధరలో లభిస్తున్న అటువంటి బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ చూడనున్నాము. ఈ టీవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, మీరు కేవలం 55 ఇంచ్ టీవీ ప్రైస్ లో 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోవచ్చు.

Best Tv Deal : Dolby Smart Tv deal

ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ గురించి చెప్పాలంటే, రియల్ మీ టెక్ లైఫ్ రీసెంట్ గా విడుదల చేసిన 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 65UHDGDRDDVB ఈ రోజు ఈ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈరోజు ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ అందించిన 55% భారీ డిస్కౌంట్ తో రూ. 35,999 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ టీవీని BOB CARD, Canara మరియు SBI క్రెడిట్ కార్డు తో ఈ టీవీ తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ మీకు కేవలం రూ. 34,499 ధరకు లభిస్తుంది.

Also Read: BSNL: రూ. 250 కంటే తక్కువ రేటులో నెల రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్.!

realme TechLife Dolby Smart Tv: ఫీచర్స్

ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ ఎల్ఈడి ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 4K UHD రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 8 పిక్చర్ మోడ్స్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది ఇది గూగుల్ టీవీ OS పై నడుస్తుంది.

ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 30W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ దూల బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్, Av ఇన్, ఈథర్నెట్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :