Flipkart Sale: భారీ డిస్కౌంట్ తో తక్కవ ధరకే లభిస్తున్న 65 ఇంచ్ QLED Smart Tv

Updated on 05-Mar-2025
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ మార్చి నెల బిగ్ బచాత్ డేస్ సేల్ ను ప్రారంభించింది

ఈ సేల్ లో భాగంగా ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందించింది

ఈ సేల్ నుంచి 65 ఇంచ్ QLED Smart Tv ని తక్కువ ధరకే అందుకోవచ్చు

Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ మార్చి నెల బిగ్ బచాత్ డేస్ సేల్ ను ప్రారంభించింది. నెల ప్రారంభం నుంచి ప్రారంభించిన ఈ సేల్ నుంచి మంచి ఆఫర్స్ అందించింది. స్మార్ట్ టీవీ విభాగంలో కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ లో భాగంగా ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ద్వారా 65 ఇంచ్ QLED Smart Tv ని తక్కువ ధరకే అందుకోవచ్చు.

ఏమిటా 65 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ ?

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు Thomson 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (Q65H1100) పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 49% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 42,999 ధరకే అందుబాటులో వుంది.

ఈ స్మార్ట్ టీవీపై అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ఈ స్మార్ట్ టీవీ పై జత చేసింది. ఈ స్మార్ట్ టీవీని Axis, BOBCARD మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ కొనేవారికి రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని రూ. 41,499 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు.

Also Read: Vivo T4x 5G : బడ్జెట్ ధరలో విడుదలైన వివో బిగ్ బ్యాటరీ ఫోన్.!

Thomson 65 inch QLED Smart Tv : ఫీచర్స్

ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 65 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.

ఈ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB మరియు HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :