Big Deal: 43 ఇంచ్ టీవీ ధరకే 50 ఇంచ్ బ్రాండెడ్ 50 ఇంచ్ 4K SmarT Tv అందుకోండి.!

Updated on 27-Jan-2025
HIGHLIGHTS

చవక ధరలో 50 ఇంచ్ బిగ్ 4K Smart Tv కొనాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మీకోసం గొప్ప డీల్ అందుబాటులో వుంది

ఈ ఆఫర్ తో కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే బ్రాండెడ్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పొందవచ్చు

Big Deal: చవక ధరలో 50 ఇంచ్ బిగ్ 4K Smart Tv కొనాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మీకోసం గొప్ప డీల్ అందుబాటులో వుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ తో కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే బ్రాండెడ్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పొందవచ్చు. మరి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.

4K Smart Tv Big Deal:

Acer లేటెస్ట్ గా మార్కెట్లో విడుదల చేసిన 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (AR50GR2851UDFL) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 50% భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అందుకే ఈ ఏసర్ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 24,999 రూపాయల ధరకు లభిస్తోంది.

ఈ స్మార్ట్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ టీవీని BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 22,499 రూపాయల అతి తక్కువ ధరకు పొందే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.

Also Read: Jio Republic Day Offer 2025: రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త ప్లాన్ ప్రకటించిన జియో.!

Acer (50) 4K Smart Tv: ఫీచర్స్

ఈ ఏసర్ 50 స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR 10 MEMC మరియు ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ ఇంజిన్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.

ఈ ఏసర్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు 36W హాయ్ ఫిడిలిటీ సౌండ్ అందించే స్పీకర్ లతో గొప్ప సోను అందిస్తుంది. ఏసర్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB 3.0, HDMI 2.1, AV ఇన్, S/PDF, 2 Way బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :