flipkart goat sale announced big deal on Coocaa Y74 pro QLED Smart Tv
GOAT Sale: ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి Coocaa లేటెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. కూకా గత వారం ఇండియాలో విడుదల చేసిన Y74 Pro 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది. కూకా ఈ స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో చేయగా, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ మరింత చవక ధరకు లభిస్తుంది.
కూకా గత వారం Y74 సిరీస్ నుంచి కొత్త తవ్లీ విడుదల చేసింది. వీటిలో 65 ఇంచ్ క్యూలేదు స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ టీవీ రూ. 43,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ స్మార్ట్ టీవీని 12 నెలల EMI తో HDFC క్రెడిట్ కార్డు ద్వారా తీసుకునే వారికి రూ. 2,500 భారీ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 41,499 రూపాయల ధరకే లభిస్తుంది.
Also Read: Realme C71: 7 వేల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ.!
కూకా ఈ స్మార్ట్ టీవీని ప్రీమియం ఫీచర్స్ తో అందించింది. ఈ టీవీ 120Hz సూపర్ రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 465 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది మరియు కమేలియన్ ఎక్స్ ట్రీమ్ AI PQ Engine తో పని చేస్తుంది. ఈ టీవీ Dolby Vision, HLG మరియు HDR10+ సపోర్ట్ తో జబర్దస్త్ విజువల్స్ అందిస్తుందని కూకా తెలిపింది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos, DTS మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది మరియు 40 W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని కూడా కూకా తెలిపింది. ఈ టీవీ Google TV 5.0 ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, బ్లూటూత్, HDMI, క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కొత్తగా విడుదలయ్యింది మరియు మేము ఈ టీవీ రివ్యూ చేయలేదు. ఈ టీవీ స్పెక్స్ షీట్ మరియు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ ను మాత్రమే వెల్లడించాము.