20 వేలకే పెద్ద QLED Smart Tv కావాలా.. ఈరోజు Flipkart అందించిన ఈ డీల్స్ మిస్సవ్వకండి.!
Flipkart సేల్ నుంచి 20 వేలకే పెద్ద QLED Smart Tv అందుకోండి
Flipkart ప్రకటించిన ఫ్లాగ్ షిప్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ డీల్స్ ను ప్రకటించింది
మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు
Flipkart ప్రకటించిన ఫ్లాగ్ షిప్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ డీల్స్ ను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ డిస్కౌంట్ ఆఫర్స్ దెబ్బకు పెద్ద QLED Smart Tv లు సైతం 20 వేల బడ్జెట్ లోనే లభిస్తున్నాయి. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు.
SurveyFlipkart సేల్ QLED Smart Tv డీల్స్
ఫ్లిప్ కార్ట్ ఈరోజు బ్రాండ్ న్యూ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను మంచి ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఇందులో, లేటెస్ట్ గా Daiwa మరియు iFFALCON లేటెస్ట్ గా తీసుకువచ్చిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు బెస్ట్ డీల్స్ తో లభిస్తున్నాయి.
Daiwa (43) QLED Smart Tv
డైవా బ్రాండ్ యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ LG Thinq సపోర్ట్ తో రీసెంట్ గా విడుదల అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 21,499 ఆఫర్ ధరకే లభిస్తోంది మరియు ICICI, BOBCARD మరియు YES కార్డ్స్ తో ఈ టీవీ తీసుకునే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ టీవీని 20 వేల బడ్జెట్ లోనే పొందే అవకాశం ఉంది.

ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi, HDMI, USB, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ మరియు Dolby Audio సపోర్ట్ గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది.
Also Read: Flipkart Flagship Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 7 వేలకే లేటెస్ట్ 8GB స్మార్ట్ ఫోన్ లభిస్తున్నాయి.!
iFFALCON by TCL (43) QLED Smart Tv
ఈ ఐఫాల్కన్ లేటెస్ట్ 43 ఇంచ్ 4K క్యూలెడ్ టీవీ ఇటీవల విడుదల అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 20,990 ధరకే ఈరోజు లభిస్తోంది. ఈ టీవీని ICICI, BOBCARD మరియు YES కార్డ్స్ తో ఈ టీవీ పర్చేస్ చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ ద్వారా ఈ టీవీ 20 వేల కంటే తక్కువ ధరకు అందుకునే అవకాశం వుంది.

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ హై బ్రైట్నెస్ మరియు Dolby Vision తో పాటు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Atmos మరియు dts X సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ లో HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile