Flipkart Flagship Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 7 వేలకే లేటెస్ట్ 8GB స్మార్ట్ ఫోన్ లభిస్తున్నాయి.!
Flipkart Flagship Sale నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ పైన భారీ డీల్స్ అందించింది
లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి
డిస్కౌంట్ ఆఫర్లతో 7 వేల ధరలో లభిస్తున్న 8GB హెవీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ డీల్స్
Flipkart Flagship Sale నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ పైన భారీ డీల్స్ అందించింది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లతో 7 వేల ధరలో లభిస్తున్న 8GB హెవీ ర్యామ్ సామ్రాట్ ఫోన్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.
SurveyFlipkart Flagship Sale స్మార్ట్ ఫోన్ ఆఫర్స్
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ పైన గొప్ప ఆఫర్లను అందించింది. ఇందులో 8GB ర్యామ్ మరియు హెవీ స్టోరేజ్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

Tecno Spark 20C
ఆఫర్ ధర : 7,999
ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, పెద్ద HD డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Helio G36 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB + 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 7,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. ICICI, BOBCARD మరియు YES బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: భారీ ఫీచర్స్ తో Google TV Streamer (4K) ను ప్రవేశపెట్టిన గూగుల్.!
Infinix SMART 8
ఆఫర్ ధర : 7,999
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ పెద్ద HD+ స్క్రీన్, 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఈ ఫోన్ కూడా Helio G36 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 8GB + 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ రూ. 7,999 ఆఫర్ ధరకే అందుతోంది. BOBCARD, ICICI మరియు YES బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా అంధిస్తుంది.
itel P55
ఆఫర్ ధర : 7,998
ఐటెల్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Yes, ICICI మరియు BOBCARD బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ ను కొంటే 10% అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ 6.6 ఇంచ్ స్క్రీన్, 50MP డ్యూయల్ రియర్, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ఏకంగా 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile