Flipkart Big Bachat Days: 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

Flipkart Big Bachat Days ఈరోజు నుంచి మొదలయ్యింది

Flipkart మంత్లీ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రకటించింది

65 ఇంచ్ QLED Smart Tv చవక ధరలో అందుకోండి

Flipkart Big Bachat Days ఈరోజు నుంచి మొదలయ్యింది. దీపావళి 2024 సేల్ ముగిసిన తర్వాత వచ్చిన వచ్చిన ఈ మొదటి సేల్ మంత్లీ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో కేవలం 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

Flipkart Big Bachat Days QLED Smart Tv Deal

మోటోరోలా యొక్క 65 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (65UHDGQMBSGQ) పై ఈ ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 68% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 43,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ మోటోరోలా 65 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 42,249 రూపాయల ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్లు ఈ క్రింద చూడవచ్చు.

Also Read: Toxic Panda Malware: ఆండ్రాయిడ్ యూజర్లు ఈ కొత్త మాల్వేర్ తో జాగ్రత్త సుమ.!

MOTOROLA 65 inch QLED smart tv: ఫీచర్స్

మోటోరోలా యొక్క ఈ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840 x 2160 రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా టీవీ MediaTek 9602 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఈ టీవీ లో 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :