Flipkart Big Saving Days first day offers huge discount on these 55 inch smart tv
Flipkart Big Saving Days: ఫ్లిప్ కార్ట్ యొక్క అతి పెద్ద సేల్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైన ఈ సేల్ నుంచి భారీ మరియు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో పాటుగా గొప్ప డీల్స్ ను కూడా అందించింది. ఈ సేల్ మొదటి రోజున ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ తో 24 వేలకే 55 ఇంచ్ Smart TV ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ పైన ఒక లుక్కేయండి.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుండి మొదలు పెట్టిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 9వ తేదీ వరకు నడుస్తుంది. ఈ సేల్ నుండి గొప్ప డీల్స్ మరియు ఆఫర్లను అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అంతేకాదు, మొదటి రోజైన ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ను కూడా అందించింది. ప్రముఖ చైనీస్ బ్రాండ్ Coocaa యొక్క 55 ఇంచ్ Ultra HD (4K) Smart TV పైన ఈ గొప్ప ఆఫర్ ను అందించింది.
కూకా యొక్క 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 72% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని SBI Credit Card and EMI తో కొనే యూజర్లు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ను అందుకోవచ్చు. అంతేకాదు, ఈ కూకా స్మార్ట్ టీవీ పైన ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో వుంది.
Also Read: SIM Card Check: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా.!
ఇక ఈ కూకా స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ పెద్ద 55 ఇంచ్ స్క్రీన్ ని Boundless Screen 4.0 ఫీచర్ తో కలిగి వుంది. ఇది 99.4% స్క్రీన్ టూ బాడీ రేషియో తో అంచులు లేకుండా కనిపిస్తుంది. ఈ టీవీ Intelligent Noise Reduction, డేటా సేవర్ మోడ్, స్మార్ట్ రిమోట్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన IPS Ultra Vivid ప్యానల్ తో వస్తుంది.
ఈ టీవీ లో 3 HDMI, 2 USB, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. అయితే, ఈ టీవీ లో కేవలం Single Band Wi-Fi, 1GB మరియు 4GB స్టోరేజ్ మాత్రమే ఉండటం పెద్ద లోతుగా చెప్పవచ్చు. ఈ కూకా స్మార్ట్ టీవీ Dolby Audio మరియు మల్టీ ఛానల్ ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంది మరియు 30W సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కూడా కలిగి వుంది.